
జగన్ హయాంలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వదలకుండా ముంచేశారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ హయాంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తాను చక్రం తిప్పిన ప్రభుత్వ హయాంలోనే తన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ బకాయిల కోసం ఆయన భార్య ఏకంగా సర్వోన్నత న్యాయస్ధానాన్నే ఆశ్రయించారు. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. జగన్ హయాంలో చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించి బకాయిల చెల్లింపుల కోసం పెద్ది రెడ్డి ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తి ఈ న్యాయమూర్తి దీపాంకర్ దత్తా నిషేధాన్ని సుప్రీం కోర్టు ధర్మాసం విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోమని విస్పష్టంగా ప్రకటించారు. హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు.
నిజానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పిఎల్ఆర్ కంపెనీ పనులను నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై సమీక్షలు జరుగుతున్నాయి. అంటే పెద్దిరెడ్డి ఇప్పుడు అడుగుతున్న బకాయిలన్నీ జగన్ హయాంలో చేసిన పనులకు సంబంధించినవే. అంటే జగన్ తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెద్దిరెడ్డికి కూడా తన హయాంలో బిల్లులు చెల్లించలేదని తేటతెల్లమౌతోంది.
ఎన్నికల సమయంలో పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన పెద్దిరెడ్డికి సొంత ప్రభుత్వం నుంచే నిధులు అందలేదన్నమాట. ఇకపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకున్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పనులకు సంబంధించి కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇచ్చారా? ఆ పనుల నాణ్యత సరిగా ఉందా.. అన్న విషయంలో కచ్చితంగా పరిశీలిస్తోంది. ఈ బిల్లుల కోసం పెద్దరెడ్డి కుటుంబం అనివార్యంగా కోర్టుకెక్కి వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పకనే చెబుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోని జగన్ ను నిలదీసింది పోయి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డిని చూసి వైసీపీ వర్గాలే జాలిపడుతున్న పరిస్థితి. ప్రభుత్వం పెద్దిరెడ్డి కంపెనీ చేసిన పనులపై విచారణకు ఆదేశిస్తే ఆయన కుటుంబం మరిన్ని చిక్కులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

C.E.O
Cell – 9866017966
.webp)
