
తమిళనాట మార్చి 19న విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘యూత్'(యూత్). తెలుగులో ఈ సినిమా రేపు(మార్చి 26) విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది.
అనివార్య కారణాలతో ఒక రోజు ఆలస్యంగా అంటే మార్చి 27న ‘యూత్’ సినిమా థియేటర్లలోకి రాబోతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. పెయిడ్ ప్రీమియర్స్ పై ప్రకటన అందించిన ప్రొడ్యూసర్లు.
కెన్ కరుణాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరాముడు, ప్రియాంషి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రలు పోషించిన ‘యూత్’ చిత్రానికి కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.
కాలేజీ జ్ఞాపకాల ‘యూత్’ ప్రయాణం
‘యూత్’ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన సొంతం చేసుకుంది. జూనియర్ ఇంటర్మీడియట్‌లో చేరిన ప్రవీణ్ (కెన్ కరుణాస్) & అతని గ్యాంగ్ చేసే అల్లరి, కాలేజీలో సీనియర్లతో గొడవలు, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించారు.
కెన్ కరుణాస్ విశ్వరూపం
ఈ సినిమా హీరో మాత్రమే కాకుండా, రచన-దర్శకత్వ బాధ్యతలను కూడా కెన్ కరుణాస్ నిర్వహించడం విశేషం. ‘అసురన్’ సినిమాలో తన నటనతో మెప్పించిన ఆయన, ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు చదువు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే పాయింట్‌తో.. ఎంతో ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు.
“మీ గ్యాంగ్‌తో రండి.. ఏజ్ లిమిట్ లేదు” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఈ తమిళంలో ఘన విజయం సాధించిన ఈ2సీ బ్యానర్ పై హౌస్ ఫుల్ వినీత్, సందీప్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.


