Home సినిమా కీలక నిర్ణయం తీసుకున్న అన్నాలెజినోవా.. వెల్ కమ్ చెప్తున్నపవన్ – Swen Daily

కీలక నిర్ణయం తీసుకున్న అన్నాలెజినోవా.. వెల్ కమ్ చెప్తున్నపవన్ – Swen Daily

by
0 comments
కీలక నిర్ణయం తీసుకున్న అన్నాలెజినోవా.. వెల్ కమ్ చెప్తున్నపవన్


-తన పేరు మార్చుకున్న పవన్ వైఫ్ అన్నా
-కీలక నిర్ణయం కూడా
-ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)వైఫ్ ‘అన్నాలెజినోవా'(Anna lezhneva)గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యానాలు అవసరం లేదు. అంతలా అభిమానులు, తెలుగు జనాలతో మమేకమై ఉంది. రీసెంట్ గా అన్నాలెజినోవా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పవన్ ఆమెకు వెల్ కమ్ చెప్పాడు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

అన్నాలెజినోవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యింది. తన పేరుని ‘అన్నా కొణిదెల’గా మార్చుకుంది. ఈ సందర్భంగా పవన్ తన భార్యకి స్వాగతం పలుకుతూ ఒక పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్‌లో డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలని పంచుకుంటావని ఆశిస్తున్నాననే వ్యాఖ్యలు చేసాడు.

ఇది కూడా చదవండి: ధురంధర్ 2: ధురంధర్ గా అల్లుఅర్జున్ చేసి ఉంటే.. ఇలాగే ఉండేది పరిస్థితి

ఇక అన్నా తన ఫస్ట్ పోస్ట్‌ని చాలా స్పెషల్‌గా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తుంది ‘ఇది ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి(చిరంజీవి)గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చానని. ముఖ్యంగా తన బయోలో ‘రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్’ అని ఉంచడం నెటిజన్లని ఆకర్షిస్తుంది. మరి పవన్ చెప్పినట్టుగా అర్థవంతమైన,స్ఫూర్తిదాయకమైన విషయాలతో అన్న కొణిదెల పవన్, చిరంజీవిని మించిన ఫాలోవర్స్ ని దక్కించుకుంటుందేమో చూడాలి.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird