Home సినిమా భయపడ్డానా!.. టివికె పార్టీకి కౌంటర్ ఇస్తూ లెటర్ రిలీజ్ చేసిన రజినీ – Swen Daily

భయపడ్డానా!.. టివికె పార్టీకి కౌంటర్ ఇస్తూ లెటర్ రిలీజ్ చేసిన రజినీ – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo


-రెండు రోజుల క్రితం టివికె పార్టీ నేత కీలక వ్యాఖ్యలు
-లెటర్ రిలీజ్ చేసిన రజనీ
-అభిమానులు ఇప్పుడు ఏమంటారు

సూపర్ స్టార్ రజనీకాంత్(రజికాంత్)గురించి ఇళయ దళపతి విజయ్(విజయ్)కి చెందిన టివికె(TvK)పార్టీ ముఖ్య నేత ఆదవ్ అర్జున్ రెండు రోజుల కిందట మాట్లాడాడు విజయ్ కి ఉన్న గుండె ధైర్యం రజనీకాంత్‌కి లేదు. అందుకే డిఏంకె పార్టీకి భయపడి రజనీ రాజకీయాల నుంచి తప్పుకున్నాడనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మాటలపై రజినీకాంత్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో ఏముందో చూద్దాం.

నాపై టివికె పార్టీ ముఖ్య నేత ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలలో ఎంత మాత్రం నిజం లేదు వాస్తవాలకి విరుద్ధంగా ఆ మాటలు ఉన్నాయి. వాటికి కాలమే సమాధానం చెబుతుంది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలుస్తూ నా కోసం గొంతు ఎత్తిన మీడియా మిత్రులకి, ప్రాణ సమానమైన అభిమానులకి థాంక్స్ .ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ నేతలు మరియు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా నాపై వచ్చిన వార్తలను ఖండించినందుకు ధన్యవాదాలు. “కాలం మాట్లాడదు.. కానీ అది వేచి చూసి సరైన సమయంలో జవాబిస్తుంది” అనే పవర్‌ఫుల్ కొటేషన్‌తో రజనీ తన భావాన్ని ముగించాడు.

కూడా చదవండి: అల్లు అర్జున్: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో అల్లు అర్జున్ క్లాస్‌మేట్

సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ అనే పేరుకి ఉన్న చరిష్మాని చెప్పడం స్టార్ట్ చేస్తే చిన్న పిల్లలు సైతం మనల్ని కూర్చోబెట్టి ఆయన మొదట సినిమా నుంచి మొన్న వచ్చిన ‘కూలీ’ వరకు రజనీ సాధించిన రికార్డులని పొల్లు పోకుండా చెప్తారు. ఇది రజనీకి మాత్రమే దక్కిన అభిమాన సినీ వరం. అంతటి శక్తి ఉన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకొని అభిమాని లేడు. రజనీ కూడా వెంటనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి ఆ విరమించుకున్నాడు. కానీ అనారోగ్య కారణాల వల్లనే విరమణ నిర్ణయం తీసుకుంటున్నానని రజనీ నే ప్రకటించాడు. తమిళనాడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ విషయం మొత్తం జరిగింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird