Home Latest News పరాభవ నామ సంవత్సరం.. కంగారు వద్దు.. ఇందులో రహస్యం తెలిస్తే షాకవుతారు..! | పరాభవ నామ సంవత్సర| పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు| పరాభవ నామ సంవత్సర పంచాంగం| పరాభవ నామ సంవత్సర ఉగాది శుభకాంక్షలు – Jananethram News

పరాభవ నామ సంవత్సరం.. కంగారు వద్దు.. ఇందులో రహస్యం తెలిస్తే షాకవుతారు..! | పరాభవ నామ సంవత్సర| పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు| పరాభవ నామ సంవత్సర పంచాంగం| పరాభవ నామ సంవత్సర ఉగాది శుభకాంక్షలు – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు, జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము. పరాభవం అంటే అగౌరవం, అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు. అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం, అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..

తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది. చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి. పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు. భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు. దీని ప్రకారం చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి, లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయిక తెలుగు సంవత్సరమని, ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు. ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి, భవ అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత, భక్తి మేళవింపు కనిపిస్తుంది. ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని ప్రారంభించడం మంచిది కాదని, ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన ఉండాలని పండితులు చెబుతున్నారు.

పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది, భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది. ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాది వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూస్తే గుణం, సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి పండుగ ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాదిని జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ..

అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird