

-రేపు వరల్డ్ వైడ్ గా ఉస్తాద్ ఆగమనం
-మరో హిట్ పవన్ ఖాతాలోకి వెళ్లిందా!
-ఫస్ట్ రివ్యూ నిజమేనా!
‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసా’ తన డైలాగ్ కి తగ్గట్టే పవన్(పవన్ కళ్యాణ్)ఈసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)విషయంలో బెనిఫిట్ షోస్ తో పాటు టికెట్ రేట్ల విషయంలో తగ్గాడు. రేపు ఉదయం మాములు రేట్స్ ,ఎర్లీ మార్నింగ్ షోస్ తో ఉస్తాద్ సందడి షురూ. అదంతా అభిమానులు, ప్రేక్షకుల కోసమే. దీంతో వాళ్లంతా నయా జోష్ తో ఉన్నారు. పైగా కొత్త సంవత్సరం ఉగాది కూడా కావడంతో వాళ్ళ రాజయోగం, ఆదాయం ఉస్తాద్ తో పెరిగాయనే ఆనందం వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు ఆ ఆనందం ఉస్తాద్ కి సంబంధించిన మరో న్యూస్ తో రెట్టింపయ్యింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.
ఉస్తాద్ ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఫస్ట్ హాఫ్ లో పవన్ ఎంట్రీ సూపర్. ఈ సందర్భంగా పవన్ నుంచి వచ్చిన డైలాగ్స్, శ్రీలీల, పవన్ మధ్య వచ్చిన సన్నివేశాలలో ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ వర్క్ అవుట్ అయ్యింది. నెగి క్యాటివ్ పార్తీబన్ తో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా పేలింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కి తగ్గట్టే చాలా వేగంగా కదిలింది. కథ మెయిన్ పాయింట్ తెరపైకి రావడంతో పాటు సున్నితమైన ఆ పాయింట్ ని చెప్పారు. విలన్స్ తో పవన్ చేసిన పోరాట దృశ్యాలు మెస్మరైజ్ చేసాయి. రాశి ఖ క్యానరక్టర్ డిజైన్ కూడా బాగుంది. దేవిశ్రీప్రసాద్(Devisriprasad)సాంగ్స్ తో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , పవన్ పెర్ఫార్మ్ ప్రధాన ప్లస్ గా నిలిచాయి.
మైత్రి నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ, ఆర్ట్ డిపార్మెంట్ కథ యొక్క ఉద్దేశ్యాన్ని చెప్పడంలో భారీగా సక్సెస్ అయ్యాయి. హరీష్ శంకర్(హరీష్ శంకర్) టేకింగ్ కూడా ఎక్స్ లెంట్ గా ఉంది. నిర్మాత రవిశంకర్ చెప్పినట్టుగా ఖుషిలో పవన్ కనిపించాడని, మూవీ అయితే ఓవర్ ఆల్ గా మెప్పించే స్థాయిలోనే ఉందంటే రివ్యూ నెత్తింట చక్కర్లు కొడుతుంది.
ఇది కూడా చదవండి: UStaad Bhagath singh: వైరల్ గా నిలుస్తున్న ఉస్తాద్ కథ..ఇంతకీ ఆ సున్నితమైన పాయింట్ ఏంటి!
మరి ఆ తర్వాత రివ్యూలో ఏ మాత్రం నిజముందో, రేపు ఉదయం ఆట కానీ తెలియదు. ఫ్యాన్స్ అయితే తమ అభిమాన సంఘ సభ్యులకు ఈ రివ్యూని షేర్ చేస్తూ పదే పదే రివ్యూని చూస్తూ మురిసిపోతున్నారు.

C.E.O
Cell – 9866017966
