Home Latest News తెలంగాణలో 130 మంది మావోల లొంగుబాటు | మావోయిస్టుల లొంగుబాటు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీస్|హైదరాబాద్ పోలీస్| వేము నరేందర్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| అదనపు డీజీపీ చారు సిన్హా| బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండో కంట్రోల్ సెంటర్| దేవ్జీ| బడే చొక్కా రావు| నూనె నరసింహా రెడ్డి – Jananethram News

తెలంగాణలో 130 మంది మావోల లొంగుబాటు | మావోయిస్టుల లొంగుబాటు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీస్|హైదరాబాద్ పోలీస్| వేము నరేందర్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి| అదనపు డీజీపీ చారు సిన్హా| బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండో కంట్రోల్ సెంటర్| దేవ్జీ| బడే చొక్కా రావు| నూనె నరసింహా రెడ్డి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


తెలంగాణలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బంజారా హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండో కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించి లొంగిపోయినట్లు వీరిలో ఏపీ మావోయిస్టు కార్యదర్శి చలసాని నమత కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ సినీ నటుడు కారాల కుమార్తె మాధవి అలియాస్ షకీల కూడా లొంగిపోయిన వారిలో విశేషంగా మారింది. దేవ్‌జీకి చెందిన పీఎల్‌ఏ కమిటీ మొత్తంతో పాటు మవోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, గన్‌మెన్లు ఉన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానంపై నమ్మకం ఉంచి ప్రధాన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకుని లొంగిపోయినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 128 ఆయుధాలు సమర్పించబడ్డాయి, వాటిలో AK-47 రైఫిల్స్ – 31, INSAS రైఫిల్స్ – 21, SLR రైఫిల్స్ – 20, .303 రైఫిల్స్ – 18, 7.62 బోర్ ఆయుధాలు – 17, 8 mm ఆయుధాలు – 2, .315 రైఫిల్స్ – 2, .315 రైఫిల్స్ – INSAS – MM1 1, BGL – 2 ఉన్నాయి.

అదనంగా ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక ఆయుధాలతో పాటు మొత్తం 5,205 తూటాలను కూడా మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాంతాలలో మావోయిస్టుల ప్రభావం తగ్గించడంలో ప్రభుత్వ పునరావాస విధానం కీలక పాత్ర పోషిస్తున్నదని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird