Home సినిమా Vishnu Vinyasam Movie Review : విష్ణు విన్యాసం మూవీ రివ్యూ – Swen Daily

Vishnu Vinyasam Movie Review : విష్ణు విన్యాసం మూవీ రివ్యూ – Swen Daily

by
0 comments
Vishnu Vinyasam Movie Review : విష్ణు విన్యాసం మూవీ రివ్యూ


-సినిమా పేరు: విష్ణు విన్యాసం
-న’టీన’టులు: శ్రీ విష్ణు,నయన్ సారిక, సత్య, గోపరాజు రమణ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, -బ్రహ్మాజీ చేపట్టారు
-సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
-మ్యూజిక్: రాధన్
-నిర్మాత: సుమంత్ నాయుడు
-బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాలు
-రచన, దర్శకత్వం: యదునాధ్ మారుతీ రావు
-రిలీజ్ తేదీ : ఫిబ్రవరి 27 , 2026

సింగిల్ మూవీ తో హీరో మెటీరియల్ రేంజ్ ని పెంచుకున్న ‘శ్రీ విష్ణు'(Sree Vishnu)ఈ రోజు ‘విష్ణు విన్యాసం'(vishnu Vinyasam)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ఐ మూవీ భామ ‘నయన్ సారిక’ (నయన్ సారిక)హీరోయిన్ కావడం, ప్రచార చిత్రాలు బాగ ప్రదర్శన మూవీపై మంచి హైప్ నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

విష్ణు(శ్రీ విష్ణు).. వాస్తు, వార ఫలాలు, జాతకాలతో డైలీ లైఫ్ ముగించే వ్యక్తి.. థర్టీ ఇయర్స్ దాటినా పెళ్లి అవ్వకపోవడానికి ఆ నమ్మకాలే కారణం.జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తుంటాడు. మనీషా (నయన్ సారిక). అందమైన అమ్మాయి. ఎన్నిపెళ్లి సంబంధాలు వచ్చినా సెట్ అవ్వవు. తను చెప్పే ఒక విషయంతో పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోతుంటారు. ఆ దిగులుతో సిగరేట్, ఆల్కహాల్ అలవాటు చేసుకుంటుంది. విష్ణుకి ఫ్యాకల్టీ గా వస్తుంది. అంటే సీనియర్ లెక్చరర్ గా. మనీషా కి సిగరెట్, ఆల్కహాల్ కూడా సప్లై చేస్తాడు. నువ్వు లేకుండా నేనుండలేనని మనీషా కి ఐలవ్ యు కూడా చెప్తాడు.మనీషా కూడా ఐ లవ్ యు చెప్తుంది. ఆ తర్వాత తనతో పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో అనే సీక్రెట్ చెప్తుంది. దీంతో మనీషా ని పెళ్లి చేసుకోవాలా లేదా అనే ఆలోచనలో పడతాడు. మనీషా చెప్పిన సీక్రెట్ ఏంటి? తనని పెళ్లి చేసుకోవాలని వచ్చిన వాళ్ళు ఎందుకు పారిపోయారు. మనీషా, విష్ణు మధ్య అసలు ప్రేమ ఉందా! చివరకి ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా అనేదే కథ

ఎనాలసిస్
ప్రస్తుత సినీ రోజుల్లో ఇలాంటి స్టైల్ ఆఫ్ కథలు వస్తాయని ఊహించలేం. కాకపోతే ఎంటర్ టైన్మెంట్, విష్ణు, మనీషా పెర్ఫార్మ్ వర్క్ అవుట్ అవ్వడంతో మాదిరి ఆనందంతో థియేటర్ నుంచి బయటకి వస్తాం. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మనీషా ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా ఎలా తెరకెక్కబోతుందనే క్యూరియాసిటీ వచ్చింది. కానీ ఆ తర్వాత విష్ణు ఇంట్రడక్షన్ తో పాటు, విష్ణు లైఫ్ లోకి మనీషా రాకముందు వరకు జరిగిన సీన్స్ అన్ని రొటీన్. విష్ణు, మనీషా పరిచయంతో పాటు, ఆ ఇద్దరి మధ్య నడిచిన కథనం, ఆ సందర్భంగా వచ్చిన డైలాగ్స్ సూపర్. ఒక్కటే నవ్వులు పూయించాయి. సినిమా మొత్తంపై ఆ సన్నివేశాలే హెలైట్ అని చెప్పవచ్చు.సత్య నుంచి వచ్చిన కామెడీ వర్క్ అవుట్ కాలేదు.ఇంటర్ వెల్ తో పాటు దాని చుట్టూ అల్లుకున్న ఎపిసోడ్ మొత్తం బాగుంది. మనీషా ఫ్యామిలీ ఏదో రహస్యాన్ని దాస్తుందనే డౌట్ ని ఫస్ట్ హాఫ్ లోనే బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మేకర్స్ ఆ క్యూరియాసిటీ ని ఓల్డ్ ఫార్మెట్ తో అల్లుకున్న సీన్స్ తో ముగించారు. సెకండ్ హాఫ్ నే మైనస్, విష్ణు మొదటి నుంచి చాలా తెలివైన వ్యక్తి కాబట్టి మనీషా ఫ్యామిలీ యొక్క ప్లాన్ ని కనిపెట్టి మనీషా ఏ విషయంలో భయపడుతుందో, ఆ విషయాన్నీ సంతోషంగా స్వీకరిస్తానని చెప్పి, మనీషా ఫ్యామిలీ ని ఒక ఆట ఆడుకునే ప్రాసెస్ లో విష్ణు తరహా బాడీ లాంగ్వేజ్ తో ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చెప్పి ఉంటే సినిమా రేంజ్లా ఉండేది. మనీషా కి తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న కుటుంబసభ్యుల చెడు ప్లాన్ గురించి కూడా తెలియనివ్వకూడదు. ప్రేమ అంటే అదే కదా..

నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు


విష్ణు గా శ్రీ విష్ణు మరోసారి తన మేనరిజం తో సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడుకున్నాడు.నా కోసం థియేటర్ కి రండి మీకు ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఎలాంటి లోటు ఉండదనే టైప్ లో కాంప్రమైజ్ కానీ లాఫింగ్ థెరపీ చేసాడు. మనీషా గా నయన్ సారిక కూడా అంతే. శ్రీ విష్ణుకి పోటాపోటీగా పెర్ఫార్మ్ ప్రదర్శించింది. సెంటిమెంట్, లవ్ సీన్స్ లో తనకి మరోసారి ఎదురులేదనే హింట్ ని ఒక రేంజ్ లోనే ఇచ్చింది. ఇతర క్యారెక్టర్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. రాధన్ మ్యూజిక్ ని వచ్చిన సాంగ్స్ లో మెరుపులు లేవు. బిజి ఏం బాగుంది.సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ బాగుంది. యదునాధ్ మారుతీ రావు దర్శకుడిగా పర్లేదు కానీ రచయితగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి

టోటల్ గా చూస్తే ఫస్ట్ హాఫ్ తో పాటు శ్రీ విష్ణు, నయన్ సారిక పెర్ఫార్మ్, ఎంటర్ టైన్ మెంట్ సూపర్. సెకండ్ హాఫ్ మైనస్.

బలాలు
1 .శ్రీ విష్ణు పెర్ ఫార్మెన్స్
2 .నయన్ సారిక పెర్ ఫార్మెన్స్
3 . కామెడీ
4 . డైరెక్షన్

బలహీనతలు
1 కథలో కొత్త ధనం ​​లేకపోవడం
2 .గ్రిప్ లేని స్క్రీన్ ప్లే
మూడు. సెకండ్ హాఫ్
4 . ప్రీ క్లైమాక్స్
5 . క్లైమాక్స్


రేటింగ్ 2 .25/5

అరుణాచలం

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird