Home Latest News వ్యవసాయరంగం నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం : రైతు సంఘం ల ఆవేదన*

వ్యవసాయరంగం నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం : రైతు సంఘం ల ఆవేదన*

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా బ్యూరోజులై10*//:మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు ర్యాలీగా వచ్చిన రైతులు  వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్‌ రంగానికి కట్టబెడుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు.  ముందుగా గాంధీ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు ర్యాలీ జరిగింది. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లు – పరిష్కారాలు అనే అంశంపై సెమినార్ తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు కాశబోయిన భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడారు. నూతన ఆర్థిక విధానాలుతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లాంటివి రైతులకు తక్కువ ధరకు వస్తాయని అప్పుడు ప్రచారం చేశారు. 1995 నుండి 2014 వరకు 3,25,000ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మోడీ ప్రభుత్వం 2014లో ఆధికారం చేపట్టిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని, తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయని, మద్ధతు ధర లభిస్తుందని ప్రచారం చేశారు. 2014 నుంచి 2024 వరకు 1,20,000ల మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.  ఉపాది అవకాశాలు తగ్గిపోయాయి. సంవత్సరానికి 200ల రోజుల ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడంలేదు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఇది ఎక్కడా ఆచరణలోకి రాలేదు. కేవలం నెలకు రూ.12వేల లోపు ఆదాయం మాత్రమే లభిస్తున్నది. రైతు భరోసా లాంటి పథకాలు కౌలు రైతులకు అందడంలేదు. రైతు బీమా కూడా రావడం లేదు. వ్యవసాయానికి రుణాలు ఇచ్చే వడ్డీ వ్యాపారులు పెరిగారు.  జాతీయ ఆదాయంలో ఒకశాతం దని కులు 40 శాతం వాటా పొందుతున్నారు. అలాగే 4 శాతం దనీకులు జాతీయాదాయంలో 56శాతం వాటాను కలిగిఉన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేట్‌ రంగానికి కట్టబెడుతున్నది. వ్యవసాయానికి విద్యుత్‌ అత్యంత ముఖ్యమైనది. దీనిని ప్రైవేటీకరిస్తున్నాయి.  ఒక్కో మీటరు ఖర్చు రూ.8వేల నుండి రూ.12వేల వరకు అవుతుంది. స్వామినాథన్‌ కమిటీ సూచించిన ప్రకారం రైతులు పండిరచిన పంటలకు సి2 (సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు) 50శాతం కలిపి మద్ధతు ధర నిర్ణయించాలి. ఇలా  వరికి సి2 ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ.2,840లు అవుతుంది. హెక్టారుకు 6 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దీని ప్రకారం లెక్కిస్తే, రైతులకు హెక్టారుకు రూ.61,530లు నష్టం వస్తుంది. ఫలితంగా రాష్ట్ర వరి రైతులు మొత్తంమీద రూ.13,500ల కోట్లు నష్టపోతారు. రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో సి2 ప్రకారం పత్తికి రూ.11,031 మద్ధతు ధర నిర్ణయించాలి. కానీ, వ్యవసాయోత్పత్తుల ఖర్చులు, ధరల కమీషన్‌ (సిఎసిపి) ప్రకారం మద్ధతు ధరను క్వింటాల్‌కు రూ.6,264లుగా నిర్ణయించారు. అంటే, రైతుకు హెక్టారుకు రూ.30,880లు నష్టం వస్తుంది. పందొమ్మిది లక్షల హెక్టార్లకు పత్తిరైతులు మొత్తం మీద, రూ.28,000ల కోట్లను నష్టపోతున్నారు. వ్యవసాయాన్ని  కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టం, వ్యవసాయ మార్కెట్ల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్‌ వ్యవసాయం, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చారు. వీటిని వ్యతిరేకిస్తూ 380 రోజులు నిరంతరం రైతులు, వారి మద్ధతుదారులు ఆందోళనలు చేశారు. 736 మంది రైతులు చనిపోయారు. ఫలితంగా, ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాల్సి వచ్చింది. అమెరికాలతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్లు   చేసుకుంటున్నారు. సుంకాలు అసలు వేయకుండా (0 ట్యాక్స్‌) దిగుమతుల అమలుకుపూనుకుంటున్నారు.  దీనివల్ల వ్యవసాయం, హార్టికల్చర్‌ ఉత్పత్తి రైతులు దెబ్బతింటారు. 2016లో ఒకొక్క రైతుకు 61,286 డాలర్లను అమెరికా ప్రభుత్వం రాయితీగా ఇచ్చింది. 2018- 19లో భారత రైతులకు 282 డాలర్లను మాత్రమే రాయితీగా భారత  ప్రభతం ఇచ్చింది. అందుకనే, అసమాన పోటీని భారతరైతులుఎదుర్కొంటున్నారు. డ్రాఫ్ట్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ ఫాలసీని అమలు చేయమని రాష్ట్రాలను కేంద్రం వత్తిడి చేస్తున్నది. కేరళ, పంజాబ్‌, తమిళ్‌నాడు రాష్ట్రాలు అమలు చేయం అని చెప్పాయి. కేరళలో సహకార సంఘాలు బలంగా ఉన్నాయి. ఆకలి, ఆహార భద్రతా సమస్య అక్కడ లేవు. దేశ వ్యాప్తంగా ఆహారభద్రతా,వ్యవసాయోత్పత్తిని కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. కర్నాటకలో కార్పొరేట్లకు 20వేల ఎకరాలను అగ్రీ ట్యూరిజం పేరుతో అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మాధవీలత, కళ్యాణి, . తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, మండల కార్యదర్శి అయిత దివాకర్, మండల ఉపాధ్యక్షులు బిస్కి సాయి కుమార్, నగర అధ్యక్షుడు సిరిగోజి రమేష్, బిస్కి స్వామి, అంకం బాలరాజు, మొట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird