Home Latest News యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు | గ్యాస్ ధరలపై యుద్ధం ప్రభావం| దేశీయ| గ్యాస్సిలెండర్| వాణిజ్య సైలెండర్| భారీ – Jananethram News

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు | గ్యాస్ ధరలపై యుద్ధం ప్రభావం| దేశీయ| గ్యాస్సిలెండర్| వాణిజ్య సైలెండర్| భారీ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


అమెరికా, ఇజ్రాయెలో, ఇరాన్ యుద్ధం ప్రభావం దేశంలోని సామాన్యుల వంటింటిపై పడింది. ఈ యుద్ధ ప్రభావంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం, ఆటంకం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఈ ప్రభావం భారత్ లో గ్యాస్ ధరల పెంపును అనివార్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై రూ. 60, వాణజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ. 115 చొప్పున ధరలు పెంచారు. గృహవసరాలకు వినియోగించే గ్యాస్ బండ ధర 965 రూపాయలకు, కమర్షియల్ సిలెండర్ ధర 2,076 రూపాయలకు చేరింది.

ఈ పెంపు నిత్యావసరాలపై కూడా పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు తొలగిపోయాయి, పరిస్థితులు చక్కబడి, చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ధరల సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird