*జననేత్రం న్యూస్ ప్రతినిధి.జూన్21*//:సారంగాపూర్ మండల కేంద్రంలో స్వర్ణ గ్రామంలో సృజన్ తండ్రి లింగన్న అనారోగ్య కారణంతో వారిస్వగృహంలోస్వర్గస్తులయ్యారని విషయం తెలుసుకునీ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం స్వర్ణ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే ధని,గ్రామంలో గడ్డం గంగాధర్ కుమారుడు సాగర్ యాక్సిడెంట్లో మరణించాడు. మరియు బోరిగాం గ్రామంలో మాజీ పిఎస్ఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డి సోదరుడు నర్సారెడ్డి అనారోగ్యంతో మరణించారు. సారంగాపూర్ మండలంలో పలు గ్రామాలలో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు మాజీ జెడ్పిటిసి సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి వెళ్లి వారి కుటుంబ సభ్యులను
పరామర్శించారు.వీరితో పాటు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ అయిర నారాయణ రెడ్డి, మాధవ్ రావు మండల అధ్యక్షులు,రాజేశ్వర్ రావు,మాజీ సర్పంచ్ రాజేశ్వర్,మాజీ ఆలూరు పిఎసిఎస్ వైస్ చైర్మన్ లక్ష్మి నారాయణ, మాజీ సర్పంచ్ దండు రాధ సాయి కృష్ణ,పాకాల రామచందర్, శ్రీకాంత్ యాదవ్ మాజీ చైర్మన్,రవి తదితరులు ఉన్నారు.


C.E.O
Cell – 9866017966
