*జననేత్రం న్యూస్ కడప జిల్లా బ్యూరో మే19*//:కడప నగరంలోని పబ్బాపురం దగ్గర ఈ నెల 27,28,29 తేదీలలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించడం జరిగింది. సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్ , బీసీ జనార్ధన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ , పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడు, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో సహా సంబంధిత ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు, కమిటీ సభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది.మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై సభకు వచ్చే వీఐపీల భద్రత, బందోబస్తు ఏర్పాట్ల గురించి కడప జిల్లా ఎస్సీ అశోక్ కుమార్ తోచర్చించాం. వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆదేశించడం జరిగింది.


C.E.O
Cell – 9866017966
