*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్24*//:జార్జిరెడ్డి PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మతాల అధిపత్యం కాదు మానవత్వాన్ని చాటుదాం* , ఉన్మాద సిద్ధాంతాలను తిప్పి కొడుదాం, సమానత్వ భావాలను ఎత్తిపడదాం అనే నినాదంతో జిల్లా కేంద్రంలో విద్యార్థి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రముఖ లాయర్ బిచ్చల తిరుమల్ రావు,
జార్జిరెడ్డి పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మందా సురేష్ మాట్లాడుతూ కాశ్మీర్ లో పర్యాటకులపై ముష్కర
దాడులు అత్యంత హేయమైన చర్య అని అన్నారు. భూగోళం మీద మతాల అధిపత్యం కాదని మానవత్వాన్ని చూపి మనిషి తత్వానికి విలువనివ్వాలని అన్నారు. రాజకీయ ఆదిపత్యం కోసం పాలకులు ఉన్మాద సిద్ధాంతాలను ప్రజలపై రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి వెలుగులోనే మనుషుల అమూర్త భావనకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.వాటి పర్యవసనాల ఫలితంగా ఇటువంటి అమానవీయ ఘటనలు , దాడులు జరుగుతున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంగా దేశంలో మత ప్రాధాన్యత రాజకీయాలు అధికారంలో ఉన్నాయని, వారి దౌత్య విధానాల ఫలితంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే అనుమానాలు దేశ ప్రజలలో నెలకొని ఉన్నాయని అన్నారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోరుకునే సమానత్వ భావాలను, రాజకీయాలను యువతరం, ప్రజానీకం ఎత్తిపట్టాలని పిలుపునిచ్చారు. టెర్రర్ ఎటాక్ తరువాత దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు కేంద్రంగా కాకుండా తార్కికంగా, హేతుబద్ధంగా విషయాలు కేంద్రంగా ఆలోచనలు చేయాలనీ అన్నారు , ఫేక్ ప్రచారాలు, అర్ధ సత్య ప్రచారాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. టెర్రర్ ఎటాక్ లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.దేశ యువత మానవతా, సమానత్వ భావాలను కాపాడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డి PDSU గర్ల్స్ కన్వీనర్ ఫైండ్ల శ్యామల, నాయకులు స్వర్ణ, మునేశ్వరి, శిల్పా, మానస,శ్రావ్య,పవిత్ర తదితరులు నాయకత్వం వహించారు..




C.E.O
Cell – 9866017966
