*జననేత్రంన్యూస్ ఏప్రిల్09*//:నిర్మల్ జిల్లా ప్రతినిధినిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిదాన్ లో భాగంగా బుధవారం రోజున సారంగాపూర్,ఆడేల్లి గ్రామాలలో అంబేద్కర్ కు పూలమాలవేసి ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పై ఏమాత్రం నమ్మకం లేని బిజెపిపార్టీ కి పరిపాలించే నైతిక అర్హత లేదు అని బిజెపి పార్టీ అధికారంలో ఉన్న ఏలాంటి అభివృద్ధి,చేయలేదన్నారు.రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ స్ఫూర్తి ని దెబ్బతీస్తూ ఆప్ర ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని వారు కోరారు.రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత అని అంబేద్కర్ కూడలి వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నారాయణరెడ్డి, భోజ గౌడ్, పిల్లి నాగయ్య,కోర్వ నవీన్ రెడ్డి, సలీమ్,నర్సారెడ్డి, నక్క రాజన్న,నారాయణ రెడ్డి, జగదీశ్వర్ ,సుమన్ భూమన్న, సాయి గౌడ్ ,బాబా, నరసయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
