*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చి27*//:ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో విచ్చలవిడిగా చట్ట ఉల్లంఘన జరిపి వందలాది అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారని అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి భక్తి ముసుగులో ఎటువంటి అనుమతులు లేకుండా 35 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇంటిపై 6 అంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని తక్షణమే నిర్మాణాన్ని నిలుపుదల చేసి కూల్చివేయాలని ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకుండా పోయిందన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య వివరించగా గ్రామపంచాయతీ కార్యదర్శి పిలిపించి తక్షణమే అక్రమంగా నిర్మించిన అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించిన గ్రామపంచాయతీ అధికారి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారుల సూచనలను లెక్క చేయకపోవడం వల్లనే ఈరోజు ఇంతమంది చావుకు కారణమయ్యారని ఆయన అన్నారు. 9 అంగుళాల పిల్లర్ పై 6 అంతస్తులు ఎలా నిలబడతాయని అధికారులను ప్రశ్నించిన పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవో, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించమని వినదులు ఇచ్చిన పరిష్కారం జరగక ప్రాణాలు పోవడం జరిగిందన్నారు. దీనిపై గతంలోనే తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు పోయేందుకు కారణమైన పంచాయతీ అధికారులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు.



C.E.O
Cell – 9866017966
