*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్17*//: ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించుటలో ఎస్సీ జనాభాలోని 59 కులాల జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయ సమతుల్యతను పాటించకపోతే సహించేది లేదని ప్రొఫెసర్ బి వి రాఘవులు మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్నిహెచ్చరించినారు వర్గీకరణ జీవో అమలుపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ బీసీలు కాకుండా ఏబిసిడిలుగా వర్గీకరించాలని అదేవిధంగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ప్రత్యేకించి రెండు మంత్రి పదవులు కేటాయించాలని రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మూడు ప్రధాన డిమాండ్లతో ఈ నెల తొమ్మిదో తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని మండల కార్యాల ముందు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసినారు నేటికీ 9వ రోజుగా కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరంలో ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటాయపాలెం గ్రామం నుండి గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు దుర్గయ్య గౌడ్ నాయకులు కార్యకర్తలకు పూలమాలలు వేసి నేటి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు ఈ దీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ బి వి రాఘవులు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఎస్సీ జనాభాలోని 59 కులాల ప్రజలకు సామాజిక న్యాయ సూత్రాన్ని అనుసరించి రిజర్వేషన్ శాతాన్ని సామాజిక న్యాయ బద్దంగా ఆలోచించి మాత్రమే ఏ బీసీలు కాకుండా ఏబిసిడిలుగా కేటగిరీలు చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసినారు ఆ విధంగా చేస్తేనే తప్ప ఏసి జాబితాలోని 59 కులాల ప్రజలకు సామాజిక న్యాయం అందే పరిస్థితి సమానంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరినారు లేనియెడల రాబోయే కాలంలో మాదిగ మాదిగ ఉపకులాల ఆగ్రహానికే కాక సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతును చొరగొన్న ఈ ఉద్యమ లక్ష్యసాధనకు ఏ మాత్రం ఆటంకాలు కల్పించిన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ స్థాయిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు నేటి శిబిరంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కనుక జనార్దన్ మాదిగ బోయన కృష్ణ మాదిగ ఖమ్మం రూరల్ మండలం మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు సిరిపురపు బొందయ్య మాదిగ ఎన్జీవో ఖమ్మం జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ పిల్లుట్ల నాగ పని వెంకటాయపాలెం గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాపట్ల శ్రీను మాదిగ బొబ్బిళ్ళ నాగరాజు మాదిగ వడ్లమూడి రాము మాదిగ వడ్లమూడి మల్లయ్య మాదిగ మహంకాళి వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
