*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్08*//:వంగూరి ఆనందరావు మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు. ఎస్సీ వర్గీకరణ జీవోకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఏబీసీలు కాకుండా Twinkle ల వర్గీకరణ చేయాలని అభివృద్ధి చెందిన కులాలను అభివృద్ధికి నోచుకోని కులాల్లో కలపరాదని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రివర్గ వర్గ విస్తరణలో ప్రత్యేకించి మాదిగలకు రెండు మంత్రి పదవులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి పదవ తేదీన పాలేరు నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచి మండల కేంద్రంలో మాదిగల ఆత్మగౌరవ డప్పుల ప్రదర్శన ను జయప్రదం చేయాలని ఎం ఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ పిలుపునిచ్చినారు ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తల్లంపాడు గ్రామంలో గ్రామ ఎమ్మార్పీఎస్ కమిటీ అధ్యక్షులు లెనిన్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన గ్రామ కమిటీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆనందరావు మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించబోతున్న తరుణంలో ఎస్సీలను ఏ బీసీలుగా కాకుండా ఏబిసిడిలుగా వర్గీకరించాలని అదేవిధంగా అభివృద్ధి చెందిన కులాలను అభివృద్ధి చెందని కులాల్లో కలుపకుండ ప్రత్యేకించి డి గ్రూప్ ఏర్పాటు చేసి ఏసీ వర్గీకరణ కు చట్టబద్ధతను ఏబిసిడిలుగా వర్గీకరించి మాత్రమే చట్టబద్ధత కల్పించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో 33 లక్షల మంది మాదిగలుగా ఉన్న మాదిగ సమాజానికి ప్రత్యేకించి మాదిగలకే క్యాబినెట్లో రెండు మంత్రివర్గ స్థానాలు కల్పించాలని కోరినారు మార్చి 10వ తేదీన కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించబోయే మాదిగల ఆత్మగౌరవ డప్పుల ప్రదర్శన ను నియోజకవర్గ పరిధిలోని తిరుమల పాలెం నేలకొండపల్లి ఖమ్మం రూరల్ మండలం మరియు కూసుమంచి మండలాల పరిధిలోని నాలుగు మండలాల గ్రామాలలో ఉన్న మాదిగలు మాదిగ ఒప్పుకులాల ప్రజలు డప్పు కళాకారులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహా ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచినారు ఈ గ్రామ సభలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు సిరిపురపు బందయ్య మాదిగ ఖమ్మం రూరల్ మండలం సీనియర్ నాయకులు బోయిన కృష్ణ మాదిగ గ్రామ పెద్దలు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మండల నాయకులు కుక్కల అశోక్ మాదిగ కొమ్ము నరసయ్య మాదిగ జిల్లపల్లి వెంకటేశ్వర్లు బూరుగడ్డ మోహన్ రావు మాదిగ మాదిగ రాములు మాదిగ జిల్లపల్లి రవి మాదిగ కొమ్ము లక్ష్మయ్య మాదిగ భూషయ్య మాదిగ రాయబారపు ఎర్రయ్య మాదిగ జి మనోజ్ మాదిగ కే గణేష్ మాదిగ డి అనిల్ మాదిగ కే నాగరాజు మాదిగ గంట మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
