*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చి05*//: బోనకల్ మండలం శాంతి నిలయం నందు మానసిక వికలాంగులకు క్షయ వ్యాధి మోంటాక్స్ పరీక్షలను జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు వారి సొంత ఖర్చుతో పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ
క్షయ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని వారానికి మించిన దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి నిర్ధారణ అయినవారికి ప్రభుత్వమే పూర్తిగా మందులు అందజేస్తుందని తెలియజేశారు
బోనకల్ మండల వైద్యాధికారి ఇ.స్రవంతి, శాంతి నిలయం చైర్మన్ ఆల్ఫీ,
ల్యాబ్ టెక్నీషియన్ అజార్, యాకూబ్, సూపర్వైజర్ విజయ్ కుమార్, ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్, ల్యాబ్ సూపర్వైజర్ శివ, ఆశా కార్యకర్తలు విజయ, దుర్గ తదితరులు పాల్గొన్నారు…


C.E.O
Cell – 9866017966
