Home Latest News కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు రూ. లక్ష కోట్ల పైనే.. కేంద్ర జలశక్తి మంత్రి | కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు | లక్ష కోట్ల రూపాయలు దాటండి | యూనియన్ | మంత్రి | జలశక్తి – Jananethram News

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు రూ. లక్ష కోట్ల పైనే.. కేంద్ర జలశక్తి మంత్రి | కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు | లక్ష కోట్ల రూపాయలు దాటండి | యూనియన్ | మంత్రి | జలశక్తి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని విస్పష్టంగా. కాళేశ్వరంలో జరిగిన అక్రమాల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయల పైమాటేనని సంచలన ప్రకటన చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభ వేదికగా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులోని తన బీజేపీ సభ్యులతో భేటీ అయిన సందర్భంగా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవినీతి, అక్రమాలకు తోడు సాంకేతిక కారణాలను కూడా ప్రాజెక్టు వైఫల్యానికి కారణాలని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్, లోపభూయిష్టమైన నిర్మాణ ప్రక్రియ కారణంగానే ఆ ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరిందని కేంద్ర మంత్రి కుండబద్దలు కొట్టారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు జీవనాడిగా అభివర్ణించారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం, లీకేజీలు బయటపడడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన వారు కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రాజెక్టు వైఫల్యం కూడా గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి కారణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత దర్యాప్తు దర్యాప్తునకు సిద్ధమైంది. అది వేరే సంగతి. ఇక తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు ధృవీకరించినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజాధనాన్ని ఈ రీతిన అడ్డగోలుగా దుర్వినియోగం చేయడం ప్రజా ద్రోహమనీ, క్షమించరాని నేరమని కూడా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు.

అదాలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే సుదీర్ఘ విచారణ జరిపి, బాధ్యులైన వారిపై నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖను నిర్వహించిన కీలక నేతలను కూడా ఈ కమిషన్ విచారించింది. ఈ కేంద్ర మంత్రి నేరుగా లక్ష కోట్ల అవినీతి అని రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో కాళేశ్వరం అక్రమాలపై కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird