Home Latest News కుటుంబ కలహాలు.. కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య | కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్య | కుటుంబం | వివాదాలు | వరంగల్ – Jananethram News

కుటుంబ కలహాలు.. కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య | కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్య | కుటుంబం | వివాదాలు | వరంగల్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు చిన్నారులు బలౌతున్న సంఘటనలు ఇటీవల పెచ్చరిల్లాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ తల్లి క్షణికావేశంలో తన రెండేళ్ల కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కామిండ్ల హరీష్ కు నాలుగు సంవత్సరాల క్రితం కళ్యాణితో వివాహం జరిగింది… వీరికి శ్రేయాన్ష్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. హరీష్ టిఎస్పి లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ మధ్య దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి కొడుకుని తీసుకొని వరంగల్ నియోజకవర్గంలోని తనవర్ధన్నపేట మండలం కట్ల గ్రామంలో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అక్కడకళ్యాణి తన కొడుకుతో సహా ఎస్సారెస్పీ కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు… మృతదేహాల కోసం పోలీసులు గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ వివాదాల కారణంగా కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird