
నేటి డిజిటల్ యుగంలో సైబర్ దాడులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కేవలం సమాచార చోరీ, ఆర్థిక మోసాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. సైబర్ దాడులు మానవ మనుగడకు, ప్రాణాలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. డెలాయిట్ సౌత్ ఆసియా సైబర్ విభాగం లీడర్ గౌరవ్ శుక్లా చెప్పన మేరకు గతంలో కేవలం కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లకే పరిమితమైన హ్యాకింగ్.. ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థలు, రవాణా. విద్యుత్ సరఫరా లాంటి కీలక ఇన్ ఫ్రాస్టక్చర్ కు కూడా పాకుతోంది. గత ఏడాదిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆపరేషనల్ టెక్నాలజీ (ఓటీ) మధ్య అంతరాలు సమసిపోయాయి. దీంతో విమానయానం, రవాణా, పబ్లిక్ యుటిలిటీ రంగాలకు పెను ముప్పు ప్రమాదం పొంచి ఉంది.
ఒక కనెక్టెడ్ కారును హైవేపై వేగంగా నడుపుతున్నప్పుడు, ఎవరైనా దానిపై సైబర్ దాడి చేసి స్టీరింగ్ నియంత్రణను స్వాధీనం చేసుకుంటే.. విమానం గాలిలో ప్రయాణించేటప్పుడు, దాని ఆపరేషనల్ టెక్నాలజీ హ్యాక్ అయితే.. ఏం జరుగుతుంది. ఇప్పుడు సైబర్ దాడుల కారణంగా అలాంటి పెను ప్రమాదాలకు కూడా అవకాశం ఉందని డెలాయిట్ సౌత్ ఆసియా సైబర్ విభాగం లీడర్ గౌరవ్ శుక్లా. సైబర్ దాడులతో ఆర్థిక చౌర్యం కంటే.. మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పుపైనే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోందంటున్నారు. వైద్య రంగంలోనూ ఈ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉందని వివరించారు. ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలపై దాడి చేసి రోగుల డేటాను మార్చడం లేదా పరికరాల పనితీరును అడ్డుకోవడం వల్ల రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. విద్యుత్ కేంద్రాలపై సైబర్ దాడులు అంధకారాన్ని సృష్టిస్తాయంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉంటే, సుమారు 3000 కోట్లకు పైగా ఐఓటీ (IoT) సర్లు వాడుకలో ఉన్నాయి, అంటే సగటున ఒక వ్యక్తి చుట్టూ మూడున్నర సెన్సార్లు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే దాదాపు పాతిక దేశాలు తమ సొంత ఇండియా స్టాక్ రూపకల్పనకు డెలాయిట్ సలహాలు ఇస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల సైబర్ దాడుల వేగం, తీవ్రత కూడా పెరుగుతున్నాయి. సైబర్ దాడులను దీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, సంస్థల సమన్వయంతో పనిచేయాలని. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే సైబర్ సెక్యూరిటీ ఎథిక్స్ గురించి బోధించాలని గౌరవ్ శుక్లా ఏర్పాటు.

C.E.O
Cell – 9866017966

