
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సింగపూర్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తన కుమార్తెలు అజీన్, అనైజ, భార్య నటాషాలతో సింగపూర్ లో హాలీడే మూడ్ లో విహరిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా విజయం వెనుక గౌతం గంభీర్ వ్యూహాలు ఉన్నాయి. జట్టును సమతూకంలో ఉంచడంలోనూ, ప్రతిభను వంద శాతం రాబట్టడంలోనూ గౌతం గంభీర్ విరామమెరుగకుండా కృషి చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యూహాలు, కఠోర శ్రమ కారణంగా టీ20 ప్రపంచకప్ 2026లో సంపూర్ణ జగజ్జేతగా నిలిచింది. ఇందు కోసం ఎంతో ఒత్తడి తీసుకుని, శ్రమించిన గౌతమ్ గంభీర్ నెక్స్ట్ టోర్నీకి సిద్ధమవుతున్న ఈ విరామాన్ని ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
సింగపూర్ వీధిలో గంభీర్ సామాన్యుడిగా పెళ్లాం పిల్లలతో విహరిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భార్య నటాషా, కుమార్తెలు అజీన్, అనైజాతో కలిసి ఆయన అక్కడి అందాలను తిలకిస్తున్నారు. ఈ సందర్భంగా తన చిన్న కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని వీధుల్లో నడుస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైదానంలో ఎంతో సీరియస్‌గా కనిపించే గంభీర్, వ్యక్తిగత జీవితంలో చాలా సరదాగా కనిపించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. 2007లో ఆటగాడిగా టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన గౌతమ్ గంభీర్.. 2026లో జట్టు హెడ్ కోచ్‌గా టీమ్ ఇండియాకు ప్రపంచకప్‌ను అందించాడు. జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కోచ్‌ల జాబితాలో లాల్‌చంద్ రాజ్‌పుత్, రాహుల్ ద్రవిడ్ సరసన సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం ఈ విహారయాత్ర ముగిసిన తర్వాత గంభీర్ తిరిగి తన బాధ్యతల్లో నిమగ్నం కానున్నారు. తదుపరి షెడ్యూల్ జూన్ నెలలో ప్రారంభం. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌లో భాగంగా భారత్ ఒక మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తరువాత టీమ్ ఇండియా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో ఉంటుంది. వరుస విదేశీ పర్యటనలు ఉన్న నేపథ్యంలో.. మధ్యలో లభించిన ఈ విరామంలో గంభీర్ మానసికంగా ధృఢంగా తయారు కావడానికి దోహదపడుతుందని అన్నారు.

C.E.O
Cell – 9866017966
.webp)
