
వదినలో అమ్మనో, అక్కనో చూసుకునే వారు ఎందరో ఉంటారు. అలాగే బావ గారిలో అన్నయ్యను చూసుకునే వారు కొందరు ఉంటారు. పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) సతీమణి అన్న లెజ్నెవా కూడా తన బావ గారయిన చిరంజీవి(చిరంజీవి)లో అన్నయ్యను చూస్తున్నారు. ఈ వేడుకను తెలుపుతూ తాజాగా ఆమె చేసిన పోస్ట్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
అన్నా లెజ్నెవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికారు. చిరంజీవి కూడా వెల్కమ్ చెప్పారు. అయితే దానికి ఆమె “థాంక్యూ అన్నయ్య” అని రిప్లై ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. బావ గారిని అన్నయ్య అని పిలవడంపై చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఒప్పందం అన్నా క్లారిటీ ఇచ్చారు.
“అన్నయ్యా? బావగారా?” అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ కట్టిపడేస్తోంది. “దాదాపు 15 ఏళ్ల క్రితం, అందరూ ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్న కుటుంబంలోకి నేను వచ్చాను. ఎలా కలవాలో, ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు. అందుకే నా భర్త వాడే మాటలనే నేనూ వాడాను. అవే అన్నయ్య, చిన్నన్నయ్య. మొదట్లో అవి నేను జాగ్రత్తగా, సందేహంతో పలికిన మాటలే.
పవన్ కళ్యాణ్ అన్నయ్యలను తన అన్నయ్యలా చేసినట్టు అన్న లెజ్నెవా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా బాండింగ్ అంటే అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

C.E.O
Cell – 9866017966

