Home Latest News టీటీడీలో ప్రసాదాల కల్తీని గుర్తించే అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబ్ సిద్ధం! | TTD అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబ్ | సీఎం చంద్రబాబు | శ్రీవారి లడ్డు | మంత్రి సత్యకుమార్ | తిరుమల | ఆహార భద్రత మరియు ప్రమాణాలు | FSSAI | నారాలోకేష్ | టీడీపీ – Jananethram News

టీటీడీలో ప్రసాదాల కల్తీని గుర్తించే అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబ్ సిద్ధం! | TTD అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబ్ | సీఎం చంద్రబాబు | శ్రీవారి లడ్డు | మంత్రి సత్యకుమార్ | తిరుమల | ఆహార భద్రత మరియు ప్రమాణాలు | FSSAI | నారాలోకేష్ | టీడీపీ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సిద్దమైన స్టేట్ ఫుడ్ లియాబరేటరీని సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. శ్రీవారి లడ్డూ, అన్న సూక్ష్మ ప్రసాదాల్లో ఇతర నాణ్యత, స్వచ్ఛత, నెయ్యి, నూనె, పాలు, ముడిసరకుల్లో కల్తీ జరుగుతున్నా పసిగట్టే పరీక్షలు ఈ అత్యాధునిక ల్యాబ్‌లో జరుగుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య యాదవ్‌ నేడొక ప్రకటనలో తెలిపారు. పుణ్య క్షేత్రాల్లో ఈ తరహా ఫుడ్ లేబరేటరీ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తెలిసింది. నూనె, పాలు, నెయ్యిలో ఫెస్టిసైడ్‌లు, ప్రిజర్వేటివ్‌లు వంటి అవశేషాలను కూడా ఈ ల్యాబ్‌లో గుర్తిస్తారని చెప్పారు. కెమికల్ ఎనాలిసిస్, మైక్రోబయాలజీ ఎనాలిసిస్ పరీక్షలకు అనుగుణంగా పరికరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

మంత్రి సత్యకుమార్ చొరవతో కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి..!

మంత్రి సత్యకుమార్ సమక్షంలో అక్టోబర్ 8, 2024న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ)తో కొత్త రాష్ట్ర అధికారులు ఒప్పందాన్ని అనుసరించి తిరుమలలో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఫుడ్ లియాబరేటరీ ఏర్పాటైంది. పలు పుణ్యక్షేత్రాల్లో ల్యాబ్స్ ఏర్పాటుపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐతో రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగినప్పటికీ తిరుమలతోనే సాధ్యమైంది.

9 నెలలకు…

కిందటేడాది జూన్ 1 నుంచి ప్రారంభమైన ల్యాబ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ల భాగస్వామ్యంతో టీటీడీ సహకారంతో ఈ ల్యాబరేటరీ ఏర్పాటుకు ఒడిఒడిగా అడుగులు పడ్డాయి. గతంలో చోటుచేసుకున్న కల్తీ ఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తిరుమలలో ల్యాబ్ కు సుమారు రూ.25 కోట్ల వరకు వ్యయమవుతోంది. టీటీడీ స్థలనివ్వగా.. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది

ఇందులో సుమారు రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలను ల్యాబ్‌లో సిద్ధం చేశారు. ల్యాబ్ కూ ట్రాన్సఫార్మర్, జనరేటర్ సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. త్వరలో రూ.3 కోట్లతో ప్రాన్స్ నుంచి ఈ-నోస్, ఈ-టంగ్ యంత్రాలు రాబోతున్నాయని చెప్పారు. ఇవి వాసన, రుచి లో తేడాలను గుర్తిస్తుంది. చిన్న పెద్ద కలిపి 50 పరికరాలు/యంత్రాలు ఉన్నాయి. ఆహార పదార్థాల్లో సేకరించిన ఒక్కో నమూనాను పదుల సంఖ్యలో పరీక్షించే సామర్థ్యం ల్యాబ్ కు ఉంది. ముడి సరుకులు, ఇతర నమూనాల విషయాల్లోనూ ఇలాగే పరీక్షలు జరుగుతాయి. మొత్తంగా ఒక నమూనా ద్వారా 50 రకాల పరీక్షలు చేయడానికి వీలుoది.

ప్రసాదాలు, జల, ముడి సరకుల నమూనాల పరీక్షలు!

కొత్తగా ఏర్పాటైన ల్యాబ్‌లో ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడిసరకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమికీటకాలు, వాటి గురించి నమూనాలు పరీక్షించడం ద్వారా తెలుసుకుంటారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, క్రిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు కారం వంటి నమూనాలను ఈ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. జలప్రసాదాల నమూనాలను సైతం ఇక్కడ పరీక్షిస్తారు. నెయ్యి, నూనెలో ఉండాల్సిన కొవ్వుల శాతం, వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వువాటిని సులువుగా గుర్తిస్తారు లడ్డూల్లో ఎనర్జీ లెవల్స్, వాడిన నెయ్యిని, ఆహారంలో వాస్తవం ఉందా? లేదా? కూడా ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు.

ఇప్పటివరకు…

తిరుమలలో 1981లో వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబరేటరీ ఏర్పడింది. 1988లో దీనిని ఉన్నతీకరించి, ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించడం. 2018లో దీనికి ఎనబీఎల్ అక్రిడిటేషన్ లభించింది. ఈ ల్యాబ్లో సాధారణ స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird