Home సినిమా మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. చరణ్ ఫ్యాన్స్ కి షాక్! – Jananethram News

మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. చరణ్ ఫ్యాన్స్ కి షాక్! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


1. పెద్ది రిలీజ్ డేట్ పై గందరగోళం:
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం కష్టమే అంటున్నారు. రీసెంట్‌గా ఒక మూవీ ఈవెంట్‌లో నిర్మాత SKN కూడా.. ‘పెద్ది’ జూన్ 26న విడుదలవుతుందంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. అదంతా తూచ్ అంటూ SKN మళ్ళీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ.. పెద్ది పోస్ట్ పోన్ న్యూస్ కి మాత్రం బ్రేకులు పడలేదు.

2. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్:
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘AA22’ నుండి ఒక పవర్-ప్యాక్డ్ వీడియో గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మూవీ టీం కేవలం టైటిల్ పోస్టర్‌తోనే సరిపెట్టే అవకాశం ఉంది. వీడియో కంటెంట్ కోసం ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. అయితే బన్నీ బర్త్ డేకి రిలీజ్ చేయబోయే పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నట్లు సమాచారం.

3. అక్టోబర్ నుంచి దేవర-2:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే ‘దేవర-2’ కొత్త అప్‌డేట్ వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవగా, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోందట. తారక్ డేట్స్ కన్ఫర్మ్ కావడంతో అక్టోబర్ మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.

4. ‘వారణాసి’ షూటింగ్ అప్‌డేట్:
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మహేష్ తన సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పూర్తి అవకాశం ఉందని సమాచారం. షూటింగ్‌తో పాటు టెక్నికల్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. కీరవాణి త్వరలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు.

5. మాఫియా డాన్‌గా చిరంజీవి:
‘వాల్తేరు డైరెక్టర్ వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ ప్రాజెక్టులకు సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి ‘మాఫియా డాన్’గా కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాయని టాక్ వినిపిస్తోంది.

6. అనుష్క శెట్టి విశ్వరూపం:
బాహుబలి తర్వాత అనుష్క శెట్టి మరో భారీ విజువల్ వండర్ ‘కథనార్’తో అలరించడానికి సిద్ధమైంది. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందించబడిన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మాయ ప్రపంచాన్ని చూపిస్తూ ట్రైలర్ అద్భుతంగా సాగింది. 19 శతాబ్దపు కేరళ నేపథ్యంలో.. ఆలయ దట్టమైన అడవులు, ప్రాచీనాల మధ్య సాగే ఈ కథలో విజువల్ పీక్ లెవెల్లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌లో అనుష్క తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేసింది.

7. జయలలిత భవనం సీజ్:
హైదరాబాద్‌లో ఉన్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్‌సీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో జె.జయలలిత పేరుతో భవనం ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవడంతో.. జయలలితకు సంబంధించిన వ్యక్తులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాజాగా అధికారులు భవనాన్ని సీజ్ చేశారు.

8. సల్మాన్ ఖాన్ సరసన నయనతార:
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపొందించిన క్రేజీ ప్రాజెక్టులోకి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’తో నార్త్ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన నయనతార.. సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు నిర్మాణం ఈ యాక్షన్ డ్రామా 2027 ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

9. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్:
“అవకాశాలు లేక ఈగలు తోలుకుంటున్నాను” అంటూ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాలోని ‘గురుతుందా’ సాంగ్ లాంచ్ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈగలు తోలుకుంటున్న తన దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారని మెలోడీ బ్రహ్మ అన్నారు.

10. నాగార్జునకు జోడిగా ఐశ్వర్య రాజేష్:
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం విశేషం. తమిళ్ డైరెక్టర్ రా.కార్తీక్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird