Home Latest News ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి.. 28న అసెంబ్లీ తీర్మానం | ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి | అపాసేంబ్లీ | స్పష్టత | మార్చి 28 | కీ – Jananethram News

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి.. 28న అసెంబ్లీ తీర్మానం | ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి | అపాసేంబ్లీ | స్పష్టత | మార్చి 28 | కీ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఈ విషయంలో వైసీపీకి వినా మరెవరికీ ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలు లేవు. అయితే అడుగడుగునా అమరావతికి అడ్డంకులు కల్పిస్తూ వైసీపీ చీకాకులు సృష్టిస్తోంది. జగన్ ఐదేళ్ల హయాంలో అప్పటికి వేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి.. నిర్వీర్యం చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకు గురిచేసింది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరాతి అడ్డంకులు తొలిగిపోయి ఏకైక రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించేందుకు సమాయత్తమౌతోంది. ఇందు కోసం ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేయడం ఆమె దించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.

ఇప్పటికే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఆమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపితే.. ఆ దిశగా కేంద్రం పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్డీయేకు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా బిల్లు ఆమోదం లాంఛనమే. ఇక బిల్లు ఆమోదం పొందితే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ గడువు దాదాపు రెండేళ్ల కిందటే.. అంటే 2024 జూన్ 2తో ముగిసింది. అంటే అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న మాట.

సీఎం చంద్రబాబు ఇటీవల తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వైసీపీ గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలంటే పార్లమెంట్‌లో చట్టబద్ధత అవసరమని చెప్పారు. అమిత్ షా సానుకూలంగా స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ముసాయిదా బిల్లు కూడా రెడీ అయ్యిందని ఇప్పటికే ఉంది.

ఈ ముసాయిదా బిల్లుకు న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల నుంచి ఆమోదం కూడా ఉందని అంటున్నారు. దీనితో అసెంబ్లీ అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం ఇక ఎలాంటి జాప్యం లేకుండా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird