Home Latest News ఇంద్రపాలనగరం గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు! | ఇంద్రపాలనగరం కొండపై కొత్త రాతియుగం జాడలు | వాదించు | భారతదేశం | పునాది | శివ | ఎంనాగిరెడ్డి – Jananethram News

ఇంద్రపాలనగరం గుట్టపై కొత్త రాతి యుగపు ఆనవాళ్లు! | ఇంద్రపాలనగరం కొండపై కొత్త రాతియుగం జాడలు | వాదించు | భారతదేశం | పునాది | శివ | ఎంనాగిరెడ్డి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


యాదాద్రి -భువనగిరి జిల్లా రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం-తుమ్మలగూడెం శివారులో, మూసీనది ఒడ్డున గల శంకరగుట్ట పైనున్న కొత్తరాతి యుగపు ఆనవాళ్లను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.

గుట్ట పైన ఉన్న పార్వతి శంకర స్వామి ఆలయ పరిసరాల్లోని పురాతన కళ్యాణి చాళుక్యుల కాలపు శిలాతోరణ శకలాలను, శాసనాలను పరిశీలించడానికి వెళ్లిన ఆయన, 100 మీటర్ల దూరంలో ఉన్న ఆలయం కుడివైపున ఉన్న బండపై రెండు చోట్ల.. నాలుగువేల సంవత్సరాలలో రాతి గొడ్డళ్లను పదును పెట్టడానికి నూరిన గాళ్లు కనిపించాయని, అవి కొత్త రాతియుగానికి చెందినవని చెప్పారు.

సమీపంలోని మూసీ నది నీటి వనరుగానూ, గుట్టపై సిద్ధమైన రాతి ఆవాసాలు తాత్కాలిక నివాసాలుగానూ ఉపయోగపడుతున్నాయని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పురాతన దేవాలయ పునరుద్ధరణ సంస్థ, అధ్యక్షులు, ఆర్కే జైన్, యువ పురవస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird