Home సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ స్పీచ్ అదరహో.. కానీ ఆ మాటల్ని గమనించారా – Jananethram News

ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ స్పీచ్ అదరహో.. కానీ ఆ మాటల్ని గమనించారా – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక
-పవన్ స్పీచ్ పై ఫ్యాన్స్ హ్యాపీ
-ప్రతి ఒక్కర్ని అభినందించాడు

సిల్వర్ స్క్రీన్ పై ఉస్తాద్ భగత్ సింగ్(ఉస్తాద్ భగత్ సింగ్)గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) కాలు మోపడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కెరీర్ లో ఫస్ట్ టైం తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది రోజు 19 న అడుగుపెట్టబోతుండటం, పైగా 18 నుంచి ప్రీమియర్స్ పడటం అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి వాతారణం నెలకొని ఉంది. రిలీజ్ ని పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ కి హాజరైన అభిమానులకి, లైవ్ లో వీక్షిస్తున్న ప్రజలకి నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైన దితో పాటు అన్నం పెట్టింది. ప్రజలకు సేవ చేసే గుర్తింపు కూడా సినిమానే. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకోవడంతో పాటు సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకి ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. నా మూవీ ఎంత వసూలు చేసిందని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సినిమా బాగుండాలని మాత్రమే కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా అనేది ఉండదు. భారతీయ సినిమా మాత్రమే ఉంటుందని నమ్ముతాను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం.

నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి కూడా నా కృతజ్ఞతలు. సినిమా విజయం సాధించాలంటే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్(హరీష్ శంకర్)చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా రోజుకి ఐదారు గంటల లోపే పనిచేస్తూ నలభై నలబైదు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసాం. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. పాలిటిక్స్ లో ఉన్నా కూడా సినిమాలు చేయొచ్చు అనే భరోసా కూడా ఉంది. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటినుంచో చెప్పేవారు. ఆ కోరిక ఉస్తాద్ తో నెరవేరుతుందని ఆశిస్తున్నాను.

లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కరభట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి కృతజ్ఞతలు. పీఆర్ఓ లక్ష్మి వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డివిజన్ నీతా లుల్లా గారికి, కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ కి, స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ గార్లకి రచయితలు రమేష్ రెడ్డి గారికి, దశరథ్ గారికి, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి, సినిమాటోఫర్ డైరెక్టర్ బోస్ గారికి దర్శకుడు గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పెర్ఫార్మర్. తన కెరీర్ లో గుర్తుండిపోయే క్యారక్టర్ ని ఉస్తాద్ లో పోషించింది. రాశి ఖన్నా గారు నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్య క్యారెక్టర్స్ చేసిన పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. మీలో ఒకరు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుత దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో ఈ సినిమా చేశాడు.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్: నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అల్లు అర్హ.. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్

నా గుండెల్లో నుంచి ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను.. హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున మీకు చూపించడం కోసం ఎంతగానో కనిపించాను. సినిమా మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపుదలకు అనుమతి ఇస్తుంది. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అభిమానులకి నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు.” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ తన స్పీచ్ లో ప్రతి ఒక్కరు పేరు ప్రస్తావించడంపై అభిమానులు పవన్ కి ఉన్న సినీ నిబద్ధతని మరో సారి ప్రశంసిస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird