
.webp)
తెలంగాణలో ప్రతీ పేదవాడికి విద్యను అందించడానికే తానే విద్యాశాఖ తీసుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మాదిగ ఎంప్లాయిస్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతు ఎస్సీ వర్గీకరణలో న్యాయం ఉంది.. మీరు బలహీనులు కాబట్టే నేను మీకు అండగా నిలబడ్డానని రేవంత్ అన్నారు. వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.
నాకు మహాభారలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం.. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు.. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాని ముఖ్యమంత్రి అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం 30 సంవత్సరాలు నలుగుతోంది.. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి.. ఎలా అయితే సాధించుకోవాల’న్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చింది..చెప్పులు కుట్టుకొమ్మని చెప్పింది.. బర్రెలు,గొర్రెలు, చేపలు కాదు.. చెప్పుకుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని నడపాలి..
మీరంతా కోరుకుంటే , ప్రజా పాలన రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాల’న్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని సీఎం చెప్పారు. 2023లో మా దగ్గర అధికార వినియోగం, అక్రమ సంపాదన లేదని రేవంత్ రూపొందించారు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో అధిపత్యాన్ని చెలాయిస్తున్న వారు ఒక వైపు, చచ్చినా సరే ఎన్నికల్లో గెలవాలని చిత్తశుద్ది తో మేం చేసిన ప్రయత్నమని రేవంత్‌రెడ్డి తెలిపారు. మాట, మూటలతో అయితే మేం ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కాలె యాదయ్య, ప్రొఫెసర్ కాశీం, కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం

C.E.O
Cell – 9866017966
