Home సినిమా 1000 కోట్లు పక్కా!.. ఈ ఇద్దరే సాక్ష్యం – Jananethram News

1000 కోట్లు పక్కా!.. ఈ ఇద్దరే సాక్ష్యం – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-‘రైరై రారా’ ప్రకంపనలు
-యువతకి మోటివేషన్
-నిమిషాల్లోనే రికార్డు వ్యూస్
-అంచనాలు రెట్టింపు

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ప్రస్తుతం ‘పెద్ది'(పెద్ది)సెకండ్ సాంగ్ రికార్డింగ్ స్టూడియో నుంచి ప్రత్యక్ష సినీ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అడుగుపెట్టడమే కాదు అభిమానులు కాలర్ ఎగేరేసుకునేలా చేయడంతో పాటు చరణ్ ఆంజనేయుడు లాంటోడు, ఆంజనేయుడు లాగా చరణ్ కి తన శక్తి తెలియదని చెప్పిన రాజమౌళి మాటని ముందు ఉంచాడు. ఇందుకు నిదర్శనంగా సెకండ్ సాంగ్ ‘రైరై రారా’ యూట్యూబ్ చరిత్రలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. పాటగానే కాకుండా, ఒక పవర్ ఫుల్ మోటివేషనల్ అంతం’ అనే కీర్తిని కూడా పొందింది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(Ar Rehman)మ్యూజిక్ ని అందించడమే కాకుండా, స్వయంగా ‘రైరై రారా'(Rai Rai Raa Raa)ని ఆలపించారు. చాలా మనసు పెట్టి పాడాడనిపించడంతో పాటు పెద్ది కి పర్ఫెక్ట్ గా సూటయ్యిందనే కితాబు అందుకుంటున్నాడు. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ప్రతి యువకుడిని ఆలోచింపజేసేలా ఉంది. “నీ అయ్య చేసిన అప్పుకి నీ కొడుకు వడ్డీ కడితే ఎలా? నువ్వు మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా’. ‘పాతికేళ్లకే పాతపడిపోకు” అన్న మాట అనుకోకోయ్, గెలుపోంటోయ్ వెలుగు.. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే.. ఆరు నూరైనా మందల్లో నుంచి వేరై రా.. నిన్నే నీ లోపల పాతేసుకోకు వంటి యువత యువత వైపు నడిపించేలా ఉంది. టోటల్ గా సాంగ్ గురించి చెప్పాలంటే జీవితాన్ని ఆటలా కాకుండా సీరియస్‌గా ఒక లక్ష్యం వైపు సాగాలని, నువ్వు అంతం చేసుకోకుండా, కొత్తగా ప్రేరణ పొందుతూ బతకాలని చెబుతుంది. నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళని ఈ సాంగ్ వెన్నుతట్టి ప్రోత్సహించడం గ్యారంటీ.

ఇక సాంగ్ లో చరణ్ ఎనర్జీ చూస్తుంటే అభిమానులకి మొదటి మూవీ ‘చిరుత’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. చరణ్ తన అభినయంతో, ఎనర్జిటిక్ మూమెంట్స్‌తో యువతని ఒక లక్ష్యం వైపు నడిపించే నాయకుడిగా ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. అయితే ఆ ఎనర్జీకి ఇప్పుడు మరింత మెచ్యురిటీ, పవర్ తోడయ్యాయి. జానీ మాస్టర్(జానీ మాస్టర్)కొరియోగ్రఫీలో వచ్చిన ‘సిగ్నేచర్ స్టెప్స్’, ముఖ్యంగా అలలు దొర్లుతున్నట్లుగా ఉండే చరణ్ మూమెంట్స్ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులు చేస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు(బుచ్చిబాబు)కూడా పెద్ది మ్యూజిక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుండటంతో పాటుపాన్ ఇండియా డైరెక్టర్‌గా ముద్రణ వేయడం ఖాయమనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల పాట విడుదల కొంచెం ఆలస్యమైనా, బుచ్చిబాబు ఒక చిన్న వీడియో క్లిప్ ని వదిలి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు. ఆ కమిట్ మెంట్ ని బట్టి రెహమాన్ నుండి తనకి కావాల్సిన అవుట్‌పుట్ ని బుచ్చిబాబు చాలా ఓపిగ్గా, స్నేహపూర్వకంగా అడిగి మరీ చేయించుకుంటున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే విడుదలైన చికిరి సాంగ్ ఒక్క తెలుగులోనే 178 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి, ఏ రికార్డు నంబర్ దగ్గర ఆగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ‘రై రైరా రా’ కూడా అదే బాటలో పయనించడం విశేషం. ఇక ఈ సాంగ్ ద్వారా అర్ధమైన కొత్త విషయం ఏంటంటే కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్ ని పెద్ది టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 30 న విడుదల కానున్న నేపథ్యంలో ‘రై రై రా రా’ ఇచ్చిన జోష్‌తో ప్రమోషన్లు మరింత వేగవంతం కానున్నాయి. డబ్బింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయినట్టుగా తెలుస్తుంది. చరణ్ సరసన అచ్చాయమ్మ గా జాన్వీ కపూర్(జాన్వీ కపూర్)జత కడుతుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన ముఖ్యమైన క్యారెక్టర్స్.పెద్ది లోని కంటెంట్ తో పాటు చరణ్ లుక్స్ చూస్తుంటే సులభంగా 700 నుంచి 1000 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది ‘మెగా ఫెస్టివల్’ ఖాయమని చెప్పవచ్చు.

కూడా చదవండి: renu desai: పోలీస్ స్టేషన్ కి రేణుదేశాయ్.. కంప్లైంట్ లో వాళ్ళ పేర్లు కరెక్టేనా!

పెద్ది కి సంబంధించిన ప్రతి అప్ డేట్ ఎక్స్ క్లూజివ్ గా మా తెలుగు వన్ సినిమా(తెలుగు వన్ సినిమా)ఛానల్ లో ఉంటుంది. మరిన్ని సినీ న్యూ అప్‌డేట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి .ఇంకా మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ స్క్రైబ్ చేయడంతో పాటు ఉన్న వీడియో కూడా చూడండి. స్టే ట్యూన్ తెలుగు వన్ సినిమా.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird