Home Latest News దౌల్తాబాద్ మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

దౌల్తాబాద్ మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ దౌల్తాబాద్ మండలం ప్రతినిధి జూలై04*//జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిర్మలాపూర్ పాఠశాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పించాలని సూచించారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు ఇప్పటినుంచే బాగా కష్టపడి శ్రద్ధగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సూచించడం జరిగింది . అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తిర్మలాపూర్, అహ్మద్ నగర్, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ముబారస్ పూర్ పాఠశాలలను సందర్శించారు. పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనుపై ఆరా తీశారు తప్పకుండా మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా సమయపాలన పాటించాలని అదేవిధంగా 15 సంవత్సరాలు దాటిన యువకులకు,వయోజనులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యను అభ్యసించే అవకాశం ఉందని గ్రామంలోని యువకులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి మండలంలోని కూడా ప్రతి గ్రామపంచాయతీలో ఉల్లాస్ ద్వారా అభ్యాసకుల వివరాలు పొందుపరచాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముత్యంరెడ్డి, ప్రశాంత్, స్వాతి సౌజన్య అదేవిధంగా సి.ర్.పి లు నగేష్, కుమార్, రాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird