*ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి
*ఏదులాపురం మునిసిపల్ పరిధిలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు పొంగులేటి
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో
జూన్22//:అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆదివారం మంత్రివర్యులు, ఏదులాపురం మునిసిపల్ పరిధిలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఏదులాపురం మున్సిపల్ ప్రాంతం నాయుడుపేట జంక్షన్ వద్ద 4 కోట్ల రూపాయలతో ఖమ్మం – మహబూబాబాద్ నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు, పెద్దతండ గ్రామంలో ఖమ్మం – సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి శ్రీ యోగానంద సాయి ఆశ్రమం చల్లపల్లి గార్డెన్ వరకు కోటీ 50 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గుదిమల్ల వాటర్ ట్యాంక్ నుండి బోడగుట్ట డొంక వరకు కోటి 21 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా*మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ*సంవత్సరంన్నర కాలంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలుచేస్తున్నామనిఅన్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధిచేపట్టామని అన్నారు. అర్హులైనపేదలందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ. యాకోబ్, ఇఇ వి. యుగంధర్, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




C.E.O
Cell – 9866017966
