జననేత్రం న్యూస్ నూగూర్ వెంకటాపురం మండలం ప్రతినిధిజూన్13*//:వెంకటాపురం మండలం కేంద్రంలో తిప్పాపురం పంచాయతీ పరిధిలో గల పెంకవాగు గ్రామంలో సేంద్రీయ వ్యవసాయం మరియు కిచెన్ గార్డెన్స్ పై అవగాహన సదస్సు కాఫేడ్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యం లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఈఓ శ్రీ కన్య పాల్గొన్నారు. శ్రీ కన్య మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో పంటల పెంపకానికి ఖరీదైన ఎరువులు పురుగుల మందులు వాడవలసిన అవసరం లేదు అదనపు ఖర్చు ఉండదు రసాయన మరియు ఎరువులు వినియోగించే ఉత్పత్తులతో పోలిస్తే సేంద్రియ ఉత్పత్తులు మరింత పోషకమైనవి ఆరోగ్యానికి మంచివి. ఇంటిలో కొంచం ఖాళీ స్థలం లో కూరగాయల మొక్కలు పెంచటం వలన స్వంతంగా పరిశుభ్రమైన వాతావరణంలో పండిoచడమే కాకుండా ఎంతో సమయం డబ్బు ఆదా అవుతుంది అన్నిటికి మించి ఆరోగ్యం ఆత్మ సంతృప్తి కలుగుతుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి హనుమంత్. వాజేడు కోఆర్డినేటర్ జి కామేష్ యానిమేటర్ ప్రశాంత్ , నరేష్ గ్రామస్తులు 80మంది పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
