*జననేత న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్27*//:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేనుసారం ఆదివారం రోజు సారంగాపూర్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బైకులు నడుపుతున్న ఏడుగురిని పట్టుకొని స్వాధీనం చేసుకొని జరిమానా విధించారు బైకులు నడుపుతున్న పిల్లల తల్లిదండ్రులకు మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని పిల్లల భవిష్యత్ తల్లిదండ్రుల పైన ఉంటుందని అలాగే తల్లిదండ్రుల మైనర్లు కు బైకులు ఇచ్చిన వారిపై చట్టరీత్య కేసులో నమోదు చేస్తామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రవి, ప్రణీత్ ,శ్రీను,రమణ,తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
