*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చి29*//:భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
టెంపుల్ అభివృద్ధి కోరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన సందర్భంగా అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా వెళ్లి పర్యటించారు.
ఇంటి యజమానులకు నష్టపరిహారాన్ని ఇస్తున్నారు. షాపులు అద్దెకి ఉంటున్న మేము నష్టపోతున్నమని తెలియజేశారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
