*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చి04*//: ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని కోదుమూరు గ్రామంలో లింగ నిర్దారణ పరీక్షలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పివోడబ్ల్యూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కళావతి బాయి వినతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ మనోజ్, చారి, కాత్యాయిని అనే వ్యక్తులు కాసులకు కక్కుర్తి పడి లింగ నిర్దారణ పరీక్షలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు గర్భిణీలకు లింగ నిర్దారణ పరీక్షలు చేస్తూ ఆడ శిశువైతే గర్భస్రావం చేస్తున్నారని వారు తెలిపారు. అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని వారిని కఠినంగా శిక్షించాలని దీని వెనక ఉన్న సూత్రదాలు, పాత్రధారులపై కేసులు నమోదు చేసి నిష్పాక్షపాతంగా విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఇటువంటి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎన్ఎఫ్ఎడబ్ల్యూ నాయకులు పోటు కళావతి, ఏపూరి లతాదేవి, తాటి నిర్మల, సిహెచ్ సీతామహాలక్ష్మి, సిహెచ్ శిరోమణి, ఎ. మంగతాయి, పి. ఝాన్సీ తదితరులు ఉన్నారు.


C.E.O
Cell – 9866017966
