
.webp)
నెల్లూరు సెంట్రల్ జైల్లో గత 100 రోజుల నుంచి ఓ హత్య కేసులో రిమైండ్ లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం బెయిల్ మీద విడుదలయ్యారు. రామకృష్ణారెడ్డికి స్వాగతం పలకడానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు మాచర్ల నియోజకవర్గం వైసీపీ నేతలు మొత్తం పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరారు.
అయితే మాజీ మంత్రులు కాకాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరికి వారు ఎడ ముఖం పెట్టుకొని కనిపించారు. జైలు ఎదుట ఇద్దరు వ్యక్తులుగా ఏర్పడ్డారు పిన్నెల్లి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీగా పిన్నెల్లిని కార్లో ఎక్కించుకొని వెళ్లేందుకు పోటీపడ్డారు. చివరకు పిన్నెల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి కార్లో ఎక్కి ఆయన ఇంటికి వెళ్లారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వైసీపీలో కాకాని వర్గం, అనిల్ కుమార్ యాదవ్ వర్గంగా విడిపోవడం విశేషం

C.E.O
Cell – 9866017966
