

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ అవార్డుల వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ ప్రముఖులు. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్, రామ్ చరణ్, నాగ చైతన్య, రష్మిక మందన్న, దిల్ రాజు, అల్లు అరవింద్, అనిల్ రావిపూడి సహా ఎందరో సినీ సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. (గద్దర్ అవార్డులు)
నిధి అగర్వాల్, దేవి శ్రీ ప్రసాద్ వంటి వారు తమ స్టేజ్ పర్ఫార్మెన్స్ లతో అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ తాను ప్పులు వేయకుండా, స్టెప్పులు వేయించడం విశేషం. ముఖ్యంగా రష్మికతో కలిసి డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిలిచింది. ‘గోంగూర తోట కాడ కాపు కాసా’ సాంగ్ కి డ్యాన్స్ చేశారు. రష్మికను డ్యాన్స్ చేయడానికి పిలిచే ముందు.. సారీ విజయ్ దేవరకొండ అని దేవిశ్రీ ప్రసాద్ ఫన్నీగా చెప్పాడు. కాగా, విజయ్-రష్మిక ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అవార్డుల జాబితా:
- ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
- రెండవ ఉత్తమ చిత్రం – దండోరా
- మూడవ ఉత్తమ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
- ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
- ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు
- ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్
- ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
- ఉత్తమ నటుడు- నాగచైతన్య (తాండేల్)
- ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ )
- ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
- ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా )
- ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె. రాబిన్ (దండోరా)
- ఉత్తమ మేల్ సింగర్- అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ ఫిమేల్ సింగర్ – సాహితీ చాగంటి (కన్నప్ప)
- ఉత్తమ కమెడియన్ – శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్)
- ఉత్తమ బాలనటుడు – రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో )
- ఉత్తమ స్టోరీ రైటర్ – గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి
- ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర (ఛాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిఫిన్ – చంద్రకాంత్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
- శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ)
- చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- రోషన్ మేక (ఛాంపియన్)
- అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)
స్పెషల్ అవార్డులు..
- ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
- పైడి జైరాజ్ అవార్డు – కమల్ హాసన్
- బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీ దత్
- కాంతారావు అవార్డు – ఆర్. నారాయణమూర్తి
- రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు – రమేష్ ప్రసాద్
- సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు – సుద్దాల అశోక్ తేజ
- అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు – జయసుధ

C.E.O
Cell – 9866017966
