
-ధురంధర్ 2 కాదు, మించిన సినిమా వచ్చింది
-ఇంతకీ ఏంటి ఆ మూవీ
-అసలు ఈ న్యూస్ నిజమేనా
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం
పాడమని నన్ను అడగవలనా… పరవశించి పాడనా అని ఒక పాటల రచయిత రాసినట్టుగా ధురంధర్ 2(ధురంధర్ 2)కలెక్షన్స్ రికార్డ్స్ గురించి భారతీయులకి చెప్పాలా! ప్రతి అప్ డేట్ వాళ్ళందరి దగ్గర ఉంటుంది. స్టిల్ ఈ నిమిషం కూడా వాళ్ళని ఏ మాత్రం కదిలించినా ధురంధర్ 2 వద్దకి చేరిన నయా రికార్డు గురించి ధురంధర్ సైనికుల పూస గుచ్చినట్టుగా విడమర్చి మరి చెప్తారు. దీన్ని బట్టి ధురంధర్ 2 ఎంత ట్రెండింగ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ధురంధర్ ప్రేమికులు షాక్ అయ్యే న్యూస్ చెప్పబోతున్నాం. స్పిరిట్ గా తీసుకుంటారో, తాడిని తన్నే వాడు ఉంటె తలని తన్నే వాడుంటాడనే సత్యాన్ని అర్ధం చేసుకుంటారో మీ ఇష్టం. మరి ఆ నయా క్రేజ్ మూవీ ఏంటో చూద్దాం.
మేడ్ ఇన్ కొరియా(మేడ్ ఇన్ కొరియా).. ఓజి భామ ప్రియాంక మోహన్(ప్రియాంక మోహన్)ముఖ్యమైన క్యారక్టర్ పోషించింది. ఒక మోస్తరు ప్రమోషన్స్ తో గత నెల మార్చి 12 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఏంటి! ఈ మూవీ ఇప్పుడు ధురంధర్ 2 హవాని అడ్డుకుందా! చెవుల్లో ఏమైనా కాలిఫ్లవర్ కనపడుతుందా అని అనుకోవడం కామన్. మీరింకా ఎక్కువ సామెతల్లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నాను. మేడ్ ఇన్ కొరియా ప్రెజంట్ 54 దేశాల్లో భారీ వ్యూస్ రాబడుతున్నాయి. దీన్ని ఆ దేశాల్లో మేడ్ ఇన్ కొరియా ట్రెండింగ్ ని అర్ధం చేసుకోవచ్చు. 54 దేశాల్లో ట్రెండింగ్ లో ఉందనే విషయాన్నీ నెట్ ఫ్లిక్స్ అధికారకంగా ప్రకటించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో విడుదలైన అత్యంత విజయవంతమైన తమిళ చిత్రంగా నిలవడంతో పాటు నెలరోజులు తిరక్కుండానే 10 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగుతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ హిందీతో సహా 12 భాషల్లో అందుబాటులో ఉంది.
కూడా చదవండి: భానుప్రియ: భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా!..ఊహించని ఆన్సర్ చెప్పిన సోదరి
ఏ భీకరమైన మలుపులు, భారీ సెట్టింగ్‌లు, చేజింగ్స్, చెవులు దద్దరిల్లే బిజిఎం లేకుండా నటినటుల పెర్ ఫార్మెన్స్, భావోద్వేగాల ఆధారంగా ప్రదర్శించబడ్డాయి. షేన్బా గా ప్రియాంక మోహన్ పెర్ఫార్మ్ అత్యద్భుతంగా ఉంటుంది. కొరియన్ నటులు కూడా తమ పెర్ఫార్మ్ తో మెప్పిస్తారు. తమిళనాడుకి చెందిన షెన్బా కొరియా దేశం ఎందుకు వెళ్ళింది. వెళ్ళాక అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనేదే కథ. రా. కార్తీక్(Ra karthik) దర్శకుడు.

C.E.O
Cell – 9866017966


