
-సోషల్ మీడియాలో భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందనే వార్తలు
-అవి నిజామా
-వివరణ ఇచ్చిన శాంతిప్రియ
తెలుగు సినిమాకి ఎనలేని సేవలు చేసిన నటిమణుల్లో భానుప్రియ(భానుప్రియ)ఒకరు. బాక్స్ ఆఫీస్ ని సైతం హీరోకి ధీటుగా సొంతం చేసుకొని భారీ ఫ్యాన్స్ బేస్ ని కూడా పొందింది.స్క్రీన్ పై కళ్ళతోనే ప్రదర్శించే పెర్ఫార్మ్ చూసి తమ అభిమాన నటి తమతోనే ఏదో చెప్తుందనుకున్న ఫ్యాన్స్ కైతే లెక్కే లేదు. అంతలా కళ్ళతోనే క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చెయ్యగలదు. పెళ్లి చూపులకి వెళ్లి భానుప్రియలాగా రూపు, కళ్ళు లేవని పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అంతలా 80 వ దశకంలో సగభాగాన్ని, 90 వ దశకాన్నితన ఛరిష్మాతో నింపేసింది. మరి అంతటి లెజండ్రీ నటిమణి మతిస్థిమితం కోల్పోయిందనే న్యూస్ ఒకటి నెత్తింట చక్కర్లు కొడుతు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని కలవరపరుస్తోంది. రీసెంట్ గా భానుప్రియ సోదరి శాంతిప్రియ(శాంతిప్రియ)ఆ వార్తలపై స్పందించడం జరిగింది. ఆమె ఏం చెప్పిందో చూద్దాం.
ఆమె మాట్లాడుతు అక్కయ్య మతిస్థిమితం కోల్పోయిందనేది అబద్దం. దయచేసి అసత్య వార్తలు ప్రచారం చేయకండి. బాడ్ గర్ల్ మూవీలో అక్క నా కోసం డబ్బింగ్ కూడా చెప్పింది బావగారు చనిపోయాక అక్కయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత కొంత కాలం నుంచి అక్కయ్యకి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఎంతో ఆనందంతో సెట్స్ కి వెళ్తుంది. కానీ అక్కడకి వెళ్ళాక క్యారెక్టర్స్ డిజైన్ మారుస్తున్నారు. దీంతో ఎంతగానో కలత చెందుతుంది. 200 సినిమాలకి పైగా చేసిన అక్క విషయంలో ఆ విధంగా ప్రవర్తించడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు అక్కయ్య ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. 80 వ తరం నటినటులు కూడా తాము ఏర్పాటు చేసుకుంటున్న ఫంక్షన్స్ కి పిలవడం లేదని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి డేట్ వచ్చేసింది.. డేట్ స్పెషల్ ఇదే
ఇప్పుడు ఈ మాటలతో భానుప్రియ మతిస్థిమితం కోల్పోలేదనే విషయం అర్ధమవుతుంది. శాంతిప్రియ పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. మహర్షి సాంగ్స్ తో అయితే సంగీత ప్రియుల ఇళ్లల్లో శాంతిప్రియ నామం నిత్య జపం.

C.E.O
Cell – 9866017966

