
అమరావతిని వైసీపీ నాశనం చేస్తే.. తాము శాసనం చేసి నిలబెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. అమరావతిలో శుక్రవారం (ఏప్రిల్ 3) మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పార్లమెంటు ఉభయ సభల్లోనూ 35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల కోసం కృతజ్ఞతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే… తమదో దారి అన్నట్లు వ్యవహరించారని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా మాకు కనిపించింది.
శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కోసం రాజకీయ, ప్రదర్శన. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయి. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని… కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

C.E.O
Cell – 9866017966
.webp)
