
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు అన్నది సామెత.. కానీ పోలీసులు అలాంటి దొంగను పట్టేశాడు. ఓ యువకుడు జలసాలకు అలవాటు పడి తన ఇంట్లోనే దఫదఫాలుగా 137 గ్రామాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అయితే ఇంట్లో వాళ్లెవరూ ఆ గుర్తించలేకపోయారు. ఇటీవల ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు నగలు ధరిద్దామని నగలపెట్టే ఓపెన్ చేసి చూడగా బంగారం చోరీ అయినట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తులో ఇంటి దొంగ బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్ అనే వ్యక్తి గత నెల 31న కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రపరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు. బంగారు నగలు కనిపించిన గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు కానీ ఇంటి పరిసరాలు, కుటుంబ సభ్యుల కదలికలు, ఫోన్ కాల్ వివరాలను పోలీసులు గుర్తించారు. బంగారు ఆభరణాలు చోరీ చేసింది మహ్మద్ షరీఫ్ కుమారుడు అద్నాన్ షరీఫ్ అని తేల్చాడు. తన స్నేహితులు మహ్మద్ రెహాన్ ఉద్దీన్ (25), మహ్మద్ సమీర్ (22)లతో కలిసి చోరీకి ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనతో కలిసి , జనవరి నుంచి నాలుగు సార్లు ఇంట్లో ఎవరికీ తెలియకుండా నగలను దొంగిలించాడని తేలింది పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 137 గ్రామాల బంగారు ఆభరణాలు,
4 సెల్ ఫోన్లు,ఒక వెర్నా కారు స్వాధీనం చేసుకున్నారు.

C.E.O
Cell – 9866017966

