
-నిన్న నామినేషన్ దాఖలు చేసిన విజయ్
-మీడియాతో ముచ్చటించిన వాణి భోజనం
-విజయ్ చెప్పిన ఆస్తుల వివరాలు ఎన్ని
వాణి భోజనం ఏం చెప్తుంది
ఇళయ దళపతి విజయ్(విజయ్)వల్ల అభిమానులకే కాదు యావత్తు ఇండియన్ సినిమా లవర్స్ , పొలిటికల్ లవర్స్ లో టెన్షన్ పెరిగిపోతుంది. ఏప్రిల్ 23న జరగనున్నతమిళనాడు ఎలక్షన్స్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవడం గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నారు. విజయ్ కూడా ఆ విషయంలో ఎవరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని అంటున్నాడు. ఈ విజయ్ కి సంబంధించిన మరిన్ని తాజా అప్ డేట్స్ కోసం నెటిజన్స్ అందరు తమకి ఎన్ని పనులున్నా సోషల్ మీడియాకి మాత్రం న్యాయం చేస్తూనే ఉన్నారు. విజయ్ గురించి ప్రముఖ హీరోయిన్ వాణి భోజనం చేసిన వ్యాఖ్యలతో పాటు నామినేషన్ సందర్భంగా విజయ్ ప్రకటించిన ఆస్తుల డీటెయిల్స్ టాక్ ఆఫ్ ది డే గా తమ ప్రాభవాన్ని చూపిస్తున్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
వాణి భోజన రీసెంట్ గా కుంభకోణంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడాను నేను విజయ్ సార్ కి వీరాభిమానిని.ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా జీవిత లక్ష్యం. ఇప్పుడు విజయ్ సార్ రాజకీయాల్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తిగా, నటుడిగా ఆయనకి ఉన్న క్రేజ్. ప్రజల కోసం ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎన్నికల్లో అయన పార్టీకి నా పూర్తి మద్దతు ఉంటుంది. ముందు ముందు ప్రచారం కూడా చేస్తాను. విజయ్ లాంటి విజనరీ లీడర్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడుకి ఎంతో అవసరమని ఆమె చెప్పుకొచ్చింది.
సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన వాణి భోజనం, ఓ మై కడవులే వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 2019లో వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తే కూడా కనిపించి సందడి చేయనుంది. ఇక విజయ్ నిన్న పెరంబూరు అసెంబ్లీ సెగ్మెంట్ స్థానం నుంచి నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన ఎలక్షన్ల అవిడిఫీట్‌లో స్థిర,చరాస్తులు కలిపి మొత్తం 520 కోట్ల రూపాయల విలువైనవిగా వెల్లడించాడు. ఇందులో స్ధిరాస్తులు 115 కోట్లు, చరాస్తులు 405 కోట్లు. 5.35 లక్షల విలువైన మారుతీ స్విఫ్ట్ కారు, 67, 400 విలువైన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఇళ్లు, స్థలాలు, బంగారం బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర చరాస్తులతో పాటు BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
అలాగే గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 2024-25లో 184.53 కోట్లు, 2023-24లో 105.69 కోట్లు, 2022-23లో 198.71 కోట్లు, 2021-22లో 237.46 కోట్లు, మరియు 2020-21లో 8.04 కోట్ల ఆదాయం వచ్చింది. విజయ్ భార్య 2020-21 ఆర్థిక సంవత్సరానికి 6,13,520 ఆదాయాన్ని ప్రకటించడం జరిగింది.

C.E.O
Cell – 9866017966

