
-దృశ్యం 3 తో సందడి చేయనున్న మోహన్ లాల్
-ఏప్రిల్ 2 కోసం అందరు వెయిటింగ్
-మరి ఎందుకు ఇలా చేసారు
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని అన్నగారు చెప్పినట్టుగా సినిమానే దేవాలయం, అభిమానులే దేవుళ్ళుగా కూడా వర్ణించుకోవచ్చు. నడుస్తున్న సినీ యుగమే ఉదాహరణ. ఇప్పుడు ఆ అభిమానులు మోహన్ లాల్ వల్ల బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
దృశ్యం(దృశ్యం).. మలయాళ బొమ్మ అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ అయ్యిందంటే దృశ్యం సృష్టించిన అభిమానం, ప్రేక్షక ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చినా కూడా వాళ్ళందరి దృశ్య దాహం తీరలేదు. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా పార్ట్ 3 యొక్క మలయాళ ఒరిజినల్ దృశ్యం యొక్క సోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్(మోహన్‌లాల్)ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. పోస్ట్‌లో ‘గతం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది. జార్జ్ కుట్టి మే 21 ,2026 న వస్తున్నాడనే పోస్ట్ చేసాడు.
ఇది కూడా చదవండి: Koratala siva: కొరటాలకి స్టార్ హీరోలు నో చెప్తున్నారా! దేవర 2కి కాలం కలిసి రావడం లేదా!
దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ఎంత పని చేసావు బాసు. ఏప్రిల్ 2 కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం కదా అనే కామెంట్స్ తో తమ అభిమాన చిరు కోపాన్ని చూపిస్తున్నారు. ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ అనే ప్రకటన ఆల్రెడీ వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా మే 21 న జార్జ్ కుట్టి ఈ సారి ఎలాంటి కేసు నుంచి తన సినీ తెలివిని ఉపయోగించి బయటపడతాడో చూడాలి. హిందీ వెర్షన్ షూట్ లో అక్టోబర్ 2 న విడుదల. అజయ్ దేవగన్ హీరో, తెలుగు వెర్షన్ మాత్రం వెంకటేష్ చేయలేదు. తెలుగులో కూడా మోహన్ లాల్, మీనాలే సందడి చేయనున్నారు.

.webp)
