
-వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ షేక్ చేసాడు
-ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి
-ఆ వార్తలు నిజమేనా!
కొరటాల శివ(కొరటాల శివ).. రైటర్ గా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దయ్యేలా చేసిన దర్శకశిఖరం. కమర్షియల్ ఫార్మెట్ కి సామాజిక స్పృహతో కూడిన టచ్ ని ఇచ్చి సూపర్ హిట్ చేయవచ్చనే సూత్రానికి కూడా ఆద్యుడు. మెగాస్టార్, మెగాపవర్ స్టార్ తో ఆచార్య చేసాక ఆ సినిమా ఫలితం కొరటాలతో పాటు అభిమానులని షాక్ కి గురి చేసింది. కానీ కొరటాల శక్తి ఏంటో తెలిసిన ఎన్టీఆర్(ఎన్టీఆర్)దేవరతో అవకాశం ఇస్తే మళ్ళీ తన సత్తా ఏమిటో బలంగా చెప్పాడు. మరి అలాంటి కొరటాల గురించి ఒక ఆసక్తికర న్యూస్ ఫిలింసర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
దేవర పార్ట్ 2(దేవర 2)ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు మొదలవుతుందో అనే విషయంలో క్లారిటీ లేదు. ఎన్టీఆర్ అప్ కమింగ్ లైనప్ ఆ విధంగా ఉంది మరి. ఈ లోపు కొరటాల మరో మూవీతో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అవ్వాలని బాలకృష్ణ, పవన్ కళ్యాణ్,నాగచైతన్యతో పాటు మరికొంత మంది బడా హీరోలని కలిసి స్టోరీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళ నుంచి స్పష్టమైన హామీ రాలేదనేది టాక్. ఈ హీరోలు తమ అప్ కమింగ్ లైన్స్ ని సెట్ చేసి ఉంచుకోవడమనే మరో టాక్ కూడా ఉంది. మరి అప్ కమింగ్ హీరోలతో కానీ లేక ఒక మోస్తరు హీరోలతో చేద్దామని అన్నా, అందుకు కొరటాల సిద్దంగా లేడని తన స్టయిల్లోనే బడా హీరోతో, బడా బడ్జెట్ సినిమానే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని అంటున్నారు.
ఇది కూడా చదవండి: Aishwarya lekshmi: ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో చేస్తుంది
వార్తలపై అభిమానులకు వ్యతిరేకంగా కొరటాల శివ పెన్నుకి ఉన్న పవర్ ఏంటో సెల్యులాయిడ్ కి బాగా తెలుసు. కాబట్టి కొరటాల కోసమే హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది. దేవర 450 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన విషయం మర్చిపోకండని అంటున్నారు. ఏది ఏమైనా హిట్ లు ఇచ్చిన దర్శకుల వెంట వెంటనే సినిమాలు రావడం లేదనేది పచ్చి సినీ నిజం. మరి కొరటాల ఎన్టీఆర్ కంటే ముందే మరో హీరోతో వస్తాడేమో చూద్దాం.


