
-సెల్యులాయిడ్ పై ధురంధర్ 2 సందడి
-పాజిటివ్ టాక్
-నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది
2016 నవంబర్ 9 న మన దేశ ప్రధానమంత్రి ‘నరేంద్ర మోదీ'(నరేంద్ర మోదీ)నోట్ల రద్దు అనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఊహించని ఆ నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవ్వడంతో పాటు నగదు లావాదేవాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. చాలా మంది మీడియా సముఖంగా మాట్లాడుతు ‘హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ముందుగానే చెప్పి ప్రిపేర్ చేస్తాను కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కానీ కారణాలని మాత్రం కేంద్ర ప్రభుత్వాలు వెల్లడి చేయలేదు. దీనితో రచయితగా టాలెంట్ లేకపోయినా షో చేస్తు కేంద్ర ప్రభుత్వ విధానాలపై రకరకాల కథనాలని చాలా మంది ఊహించుకుంటూ వచ్చారు. కానీ రీసెంట్ గా విడుదలైన ధురంధర్ 2(ధురంధర్ 2)లో నోట్ల రద్దు అంశంపై చెప్పిన తీరు ప్రతి ఒక్కరు ఆలోచింపజేస్తుంది. వాటి వివరాలేంటో చూద్దాం.
ధురంధర్ 2 లో ముంబై అండర్ వరల్డ్ డాన్, ముంబై బాంబు పేలుళ్ల సూత్రదారి ‘దావుద్ ఇబ్రహీం’ ఒక కీలకమైన క్యారక్టర్ లో కనిపిస్తాడు. పాకిస్తాన్ లోనే ఉంటాడు ఇండియాని దెబ్బ కొట్టాలని చూస్తే దావుద్ విషప్రయోగం వల్ల అందవికారంగా మారి మంచంపైనే పడి ఉంటాడు. తన దగ్గర ఉన్న అరవై వేల కోట్ల రూపాయిల ఇండియన్ కరెన్సీ తో ఇండియాలోని అన్ని ప్రాంతాల్లోని యువతకి డ్రగ్స్ అలవాటు చేయడంతో పాటు ఆ డబ్బుతో ఆయుధాలు అందజేయాలనేది దావూద్ ప్లాన్ . ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఈ విషయం హంజా(ధురంధర్) కి తెలియడంతో ఇండియన్ ఇన్విస్టిగేషన్ బ్యూరో హెడ్ ‘అజయ్ సన్యాల్’ కి చెప్తాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ పబ్లిక్ నోట్ల రద్దుని ప్రకటించడాన్ని పార్ట్ 2 లో చూపించారు.దీంతో సోషల్ మీడియాతో పాటు ఈ అంశంపై భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది.
ఇది కూడా చదవండి: Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ కొత్త మూవీ ఇదే.. సాహూ లాంటి ఆఫర్ అవుతుందా!
ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 1 లు మన దేశానికి, పాకిస్తాన్ కి మధ్య జరిగిన కొన్ని నిజ సంఘటనలని బేస్ చేసుకొని ప్రదర్శించారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ వద్ద ధురంధర్ 2 పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండడంతో ధురంధర్ అభిమానులతో థియేటర్లు కలకలలాడుతున్నాయి.

