
భారత విమానయాన రంగంలో ప్రయాణికుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోని వివిధ విమానయాన సంస్థలకు చెందిన సుమారు 50 శాతం వాణిజ్య విమానాల్లో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన తాజా నివేదికలో పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. పార్లరీమెంటల్ ప్యానెల్ నివేదిక ప్రకారం.. జనవరి 2025 నుండి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో మొత్తం 754 విమానాలను క్షుణ్ణంగా ఆడిట్ చేయగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాల పట్ల ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల్లోనే ఈ లోపాలు ఎక్కువగా ఉన్నాయని నివేదించింది. ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలను తనిఖీ చేయగా, ఏకంగా 137 విమానాల్లో లోపాలు కనిపించాయి. ఇండిగోకు చెందిన 405 విమానాల్లో 148 విమానాలు మొండికేస్తున్న సాంకేతిక సమస్యలతో నడుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.సాంకేతిక లోపాలతో పాటు సిబ్బంది శిక్షణ, విధుల్లో నిర్లక్ష్యం వస్తువులను కూడా కమిటీ తప్పుబట్టింది. బోయింగ్ 787, 777 వంటి భారీ విమానాలను నడిపే పైలట్ల శిక్షణలో లోపాలు ఉన్నాయని, అంతర్జాతీయ విమానాల్లో తగినంత మంది క్యాబిన్ క్రూ లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని కమిటీ పేర్కొంది.
గత ఏడాది అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్వహించిన తనిఖీల్లో కూడా సుమారు 10 రకాల భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఇందులో ఏడు అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘనలు ఉన్నాయి. కేవలం విమానయాన సంస్థలే కాకుండా, సంస్థ అయిన DGCA లో 48 సంవత్సరాలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పర్యవేక్షణ లోపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణ చెలగాటం ఆడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

C.E.O
Cell – 9866017966
.webp)
