
శేరిలింగంపల్లికి చెందిన వ్యాపారవేత్త, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఈ ఘటన నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌లో జరిగింది… గురువారం సాయంత్రం నవంబరులో జరగనున్న హాకీ ఇండియా గాంధీ గాంధీ ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండా విజయ్ కుమార్‌ను రాజీవ్ అంతర్జాతీయ విమాన శ్రయంలో స్థానిక అధికారులు అడ్డుకుని పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విమానాశ్రయంలో దిగగానే… అక్కడి ఢిల్లీ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్ట్ లోనే విచారణ చేపట్టారు.
విచారణ సమయంలో ఆయన వద్ద ఉన్న మొత్తం బంగారాన్ని పూర్తిగా సీజ్ చేశారు. ఇంకా ఆయన ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 12 గంటల పాటు కొండ విజయ్ కుమార్ ను విచారణ అనంతరం హాకీ ఇండియా అవార్డుకు హాజరుయ్యేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. అయితే తదుపరి విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరిణామం తో కొండ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ ప్రతినిధులు, అభిమానుల్లో ఆందోళన. అధికారులు చర్యలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

C.E.O
Cell – 9866017966
.webp)
