Home సినిమా రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్! – Jananethram News

రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


  • ‘పెద్ది’ షూటింగ్‌లో రామ్ చరణ్‌కు ప్రమాదం
  • చరణ్ కంటి గాయంపై చిరంజీవి ఎమోషనల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్) ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. చరణ్ కంటికి గాయం కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఆందోళనలన్నింటికి తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది'(పెద్ది) షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం(మార్చి 24) ఓమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా, చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న గాయమైంది. అప్రమత్తమైన చిత్ర యూనిట్, ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ ఆబ్జెక్ట్‌ని వైద్య బృందం చరణ్ కంటి రెప్పకు చిన్న సర్జరీ చేశారు. సుమారు నాలుగు కుట్లు పడినట్లు.

ఈ క్లిష్ట సమయంలో సకాలంలో స్పందించి, అత్యంత నైపుణ్యంతో చికిత్స అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “చరణ్ కంటికి జరిగిన గాయం మాలో కొంత ఆందోళన కలిగించింది. కానీ మీ ఖచ్చితత్వం, శ్రద్ధ, నైపుణ్యం మా ఆందోళనను తొలగించాయి. మేము మీకు ఎంతో రుణపడి ఉంటాం” అంటూ చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మెగాస్టార్ అప్‌డేట్‌తో ఊపిరి పీల్చుకున్న అభిమానులు, చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ తన డెడికేషన్ ను మరోసారి చాటుకున్నారు. కంటికి సర్జరీ జరిగినప్పటికీ, ఆయన ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ షూటింగ్ కి రెడీ అయినట్లు సమాచారం.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాలు నిర్మిస్తోంది.

పెద్ది సినిమా ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి రానుంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ టీజర్ రిలీజ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird