
-పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్ 2
-శంకర్ ట్వీట్ వైరల్
-ట్వీట్ లో ఏముంది
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ధురంధర్ 2(ధురంధర్ 2)హవా స్పష్టమనే సంకేతాలు వస్తున్నాయి. ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు టాక్ విషయంలో ఏమైనా మార్పు వస్తుందేమో అనే చర్చ కొంతమందిలో జరిగింది. కానీ రెండో రోజు కూడా బాగుందనే టాక్ వస్తుంది పార్ట్ 1 లాగానే పార్ట్ 2 కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకంతో అందరు ఉన్నారు. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ధురంధర్ 2 ని వీక్షించి తన అభినందనలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళల్లో శంకర్(శంకర్)కూడా ఒకరు. ఆయనేం చెప్పాడో చూద్దాం.
ఎక్స్ వేదికగా శంకర్ సూచన నిజంగా జరిగిన సంఘటనలని కల్పిత పాత్రలతో ప్రదర్శించి ఒక అద్భుతమైన సినిమాని ధురంధర్ 2 ద్వారా దర్శకుడు ఆదిత్య ధర్(ఆదిత్య ధర్)అందించారు. సినిమా చూస్తున్నంత సేపు డ్యూరేషన్ ఎక్కువగా ఉందనే ఆలోచన కూడా రాలేదు. కొన్ని సీన్స్ ని ఎంతో కన్వీనెంట్ గా లెంగ్త్ తో సంబంధం లేకుండా ప్రదర్శించడం ఊహించని విధంగా ఉంది. శాశ్వత్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. రణవీర్(Ranveer Singh) టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది. మాధవన్ కూడా తన పెర్ఫార్మన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో సాలిడ్ గా కనిపించారు. ముఖ్యంగా నటినటుల ఎంపిక సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. ఇండియన్ సినిమా దగ్గర ధురంధర్ 2 ఒక చారిత్రక మూమెంట్ గా నిలుస్తుందని శంకర్ ఎక్స్ వేదికగా తెలిపాడు.
ఇది కూడా చదవండి: కన్యాకుమారి: థియేటర్లలో చూడలేదు.. ఓటీటీలో తెగ చూస్తున్నారని
ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద శంకర్ ద్వారా కూడా కొత్త తరహా కథ, కథనం, టేకింగ్ తో కూడిన సినిమాలు వచ్చాయి. కాకపోతే కొంత కాలం నుంచి వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు. భారతీయుడు 2 , గేమ్ చేంజర్ చిత్రాలే ఉదాహరణ. తన అప్ కమింగ్ మూవీతో అయిన శంకర్ తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి ఈ టైంలో ధురంధర్ పార్ట్ 1 ని పొగుడుతో శంకర్ నుంచి ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో ధురంధర్ 2 ని శంకర్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కొంత మంది నికార్సయిన సినిమా ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

